
ఏపీకి విశాఖను పరిపాలన రాజధానిగా ఫిక్స్ చేసిన సీఎం జగన్ మే 6 నుంచి అక్కడినుంచే పాలించాలని డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే విశాఖను అన్నింటికి హబ్ చేయాలని డిసైడ్ అయ్యాడు.
ఈ క్రమంలోనే విశాఖలో అతిపెద్ద సినీ స్టూడియో నిర్మించాలని జగన్ సర్కార్ డిసైడ్ అయ్యింది. దాంతోపాటు మూడు దశాబ్ధాల క్రితం సినీ ప్రముఖులకు స్టూడియోల కోసం పెద్ద ఎత్తున నాడు భూములు కేటాయించారు. అయితే రామానాయుడు స్టూడియోను మాత్రమే నిర్మించారు. మిగతా వారికి ప్రోత్సాహాలిచ్చి స్టూడియోల నిర్మాణానికి ఒప్పించడానికి సంప్రదింపులు జరపాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.
ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం చొరవతీసుకొని విశాఖలో అద్భుతమైన సినీ స్టూడియోను నిర్మించాలని ప్రతిపాదిస్తోంది. ప్రభుత్వమే కడితే సినిమా రంగానికి సంబంధించిన పూర్తి కార్యకలాపాలు విశాఖలో సాగుతాయని.. ఏపీ కళాకారులకు అవకాశాలు వస్తాయని జగన్ సర్కార్ భావిస్తోంది.
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి ఇప్పటికే జగన్ కొండలను ఎంపిక చేశాడని.. అక్కడ నిర్మిస్తారని అంటున్నారు. ఇదే జరిగితే హైదరాబాద్ కే పరిమితం అయిన సినీ ఇండస్ట్రీ విశాఖకు మారుతుందన్న విశ్వాసం జగన్ లో ఉంది.