https://oktelugu.com/

భయం భయం : ఏపీలో కరోనా కల్లోలం

కనుమరుగైందనుకుంటున్న కరోనా మళ్లీ దాపురించింది. ఏపీలో మరోసారి విజృంభించింది. కరోనా తీవ్రత ఇన్నాళ్లు మహారాష్ట్ర సహా ఉత్తరాదిన కనిపించగా తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31142 కరోనా టెస్టులు చేయగా.. 1005 కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా గుంటూరులో 225 కేసులు.. అత్యల్పంగా విజయనగరంలో 13 కేసులు నమోదయ్యాయని తెలిపారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో […]

Written By:
  • NARESH
  • , Updated On : March 28, 2021 / 08:33 PM IST
    Follow us on

    కనుమరుగైందనుకుంటున్న కరోనా మళ్లీ దాపురించింది. ఏపీలో మరోసారి విజృంభించింది. కరోనా తీవ్రత ఇన్నాళ్లు మహారాష్ట్ర సహా ఉత్తరాదిన కనిపించగా తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది.

    ఏపీలో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31142 కరోనా టెస్టులు చేయగా.. 1005 కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా గుంటూరులో 225 కేసులు.. అత్యల్పంగా విజయనగరంలో 13 కేసులు నమోదయ్యాయని తెలిపారు.

    తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 898815 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

    గడిచిన 24 గంటల వ్యవదిలో కోవిడ్ బారినపడి చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 7205కు చేరింది.

    ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 324 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 886216కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5394 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

    రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,48,90,039 కరోనా టెస్టులు చేసినట్టు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.