Homeఎంటర్టైన్మెంట్Film industry: సినీ ఇండస్ట్రీపై మరో పిడుగు.. మళ్లీ కోలుకునేనా?

Film industry: సినీ ఇండస్ట్రీపై మరో పిడుగు.. మళ్లీ కోలుకునేనా?

Film industry: సినిమా ఇండస్ట్రీ ఇక కోలుకుంటున్నదని అనుకునే లోపే మళ్లీ కష్టాలు మొదలవుతున్నాయని కొందరు సినీ పరిశీలకులు అంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా సినిమాల పండుగ ఉంటుందని ఆశించిన సినీ అభిమానులకు నిరాశే ఎదురవుతున్నది. పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయని ఆనందపడే లోపు అవి పోస్ట్ పోన్ అయిపోయాయి. ‘ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్’ విడుదల వాయిదా పడగా, కనీసం చిన్న సినిమాలైనా చూసుకోవచ్చని ఆశపడుతున్న ప్రేక్షకులకు అవి కూడా చూసుకునే చాన్సెస్ కనబడటం లేదు.

Film industry
Film industry

పండుగ సందర్భంగా చిన్న సినిమాలు అయినా సరే వాటిని చూసేందుకుగాను జనాలు థియేటర్స్‌కు వస్తే ఆనందంగా ఉంటుందని, ఆ విధంగానైనా వసూళ్లు కొంచెం రావచ్చని థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అనుకుంటున్నట్లు టాక్. కాగా, ఏపీ సర్కారు ఆ ఆశలను కూడా అడియాసలు చేయబోతున్నది. ఈ నెల 10 నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ విధించాలని ఏపీ సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. అదే కాని జరిగితే ఈ సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు పెద్ద దెబ్బే పడుతుంది.

Also Read: లండన్ లో ప్రియుడితో డేటింగ్ చేస్తున్న రకుల్ !

కీలకమైన సెకండ్ షోలు నైట్ కర్ఫ్యూ వలన రద్దు అయిపోతాయి. అలా ప్రొడ్యూసర్స్ తీవ్రంగా నష్టపోతారు. అయితే, దేశమంతా కరోనా కేసుల తీవ్రత బాగా పెరిగిపోతున్నది. థర్డ్ వేవ్ పరిస్థితులు వస్తున్నాయని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో జనం భయపడిపోతున్నారు. ఈ క్రమంలోనే థర్డ్ వేవ్‌ను అడ్డుకునేందుకుగాను రాష్ట్ర సర్కారు ఈ విధమైన చర్యలకు సిద్ధమైనట్లు టాక్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ క్రమంలోనే నైట్ కర్ఫ్యూ విషయంలో కీలకమైన డెసిషన్స్ తీసుకోబోతున్నదని తెలుస్తోంది.

తెలంగాణ సర్కారు కూడా త్వరలో నైట్ కర్ఫ్యూ పెట్టే చాన్సెస్ ఉంటాయని పలువురు అంచనా వేస్తున్నారు. మొత్తంగా మళ్లీ కరోనా భయానక పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే, ప్రజలు అనవసర భయాలు పెట్టుకోవద్దని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి కంపల్సరీగా చేయాలని ఈ సందర్భంగా ఆరోగ్యనిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.

Also Read: ఛాన్స్ ల కోసం లేటు వయసులో హీరోయిన్ తాపత్రయం !

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version