https://oktelugu.com/

Allu Arjun: సూపర్ స్టార్ మహేష్ బాబుకి “థాంక్ యూ” చెప్పిన ఐకాన్ స్టార్… ఎందుకంటే ?

Allu Arjun: ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషనల్‌లో వచ్చిన చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’. డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాన్‌ ఇండియా చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా వచ్చిన ఈ చిత్రం ముఖ్యంగా హిందీలో అంచనాలను మించి కలెక్షన్లు రాబడుతోంది. పుష్ప రిలీజై 20 రోజులు గడుస్తున్న కానీ కలెక్షన్ల సునామి మాత్రం అగడం లేదు. ముఖ్యంగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 5, 2022 / 04:54 PM IST
    Follow us on

    Allu Arjun: ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషనల్‌లో వచ్చిన చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’. డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాన్‌ ఇండియా చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా వచ్చిన ఈ చిత్రం ముఖ్యంగా హిందీలో అంచనాలను మించి కలెక్షన్లు రాబడుతోంది. పుష్ప రిలీజై 20 రోజులు గడుస్తున్న కానీ కలెక్షన్ల సునామి మాత్రం అగడం లేదు. ముఖ్యంగా స్టైలిస్‌ స్టార్‌ అల్లు అర్జున్ తన నటనతో అందరిని ఫిదా చేశాడు. చెప్పాలంటే పుష్పలో అల్లు అర్జున్‌ నటనను వన్‌ మ్యాన్‌ షో అనోచ్చు అనేంతగా పుష్ప రాజ్‌గా బన్నీ ఒదిగిపోయాడు.

    ఈ మేరకు తాజాగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు పుష్పా టీమ్ పై ప్రశంసంలు వర్షం కురింపించాడు. ‘పుష్పగా అల్లు అర్జున్‌ నటన స్టన్నింగ్‌, ఒరిజినల్‌, సెన్సేషనల్‌గా ఉంది. అత్యద్భుతంగా నటించాడు. తన సినిమాలు ఎంత వాస్తవంగా, పచ్చిగా, నిజాయితీగా ఉంటాయో సుకుమార్‌ మరోసారి నిరూపించాడు’ అని చెప్పుకొచ్చాడు. అలాగే ‘పుష్ప’కు పని చేసిన టెక్నీషియన్ల గురించి మరో ట్వీట్‌ చేశాడు.

    https://twitter.com/urstrulyMahesh/status/1478414212518998019?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1478414212518998019%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fallu-arjun-gave-reply-mahesh-babu-over-his-tweet-about-pushpa-movie-1425117

    ఇక మ‌హేశ్ చేసిన ట్వీట్‌పై అల్లు అర్జున్ స్పందిస్తూ ఆయ‌న‌కు థ్యాంక్స్ చెప్పాడు. ‘థ్యాంక్యూ వెరీ మ‌చ్ మ‌హేశ్ బాబు గారూ.. పుష్ప సినిమా బృందం అంద‌రి ప‌ని తీరును మీరు మెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మా హృద‌యాల‌ను గెలుచుకున్న అభినంద‌న’ అంటూ అల్లు అర్జున్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.