Peddi 28 Days Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదలై విజయవంతంగా 28 రోజులు పూర్తి అయ్యింది. అంటే నాలుగు వారాలు అన్నమాట. రేపు కొత్త చిత్రాలు విడుదల కావడంతో , ఈ సినిమాని అనేక ప్రధాన నగరాల్లో ఎత్తేస్తున్నారు. అంటే దాదాపుగా ఈ చిత్రం థియేట్రికల్ రన్ క్లోజింగ్ కి వచ్చినట్టే. అభిమానులు థియేటర్స్ లో మంచి ఆక్యుపెన్సీ లతో రన్ అవుతున్నప్పటికీ, ఎత్తేయడం అసలు ఏ మాత్రం బాగోలేదని , ఇది చాలా అన్యాయం అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. అత్యధిక థియేటర్స్ లో ఈ వారం కూడా కొనసాగిస్తే, కచ్చితంగా ఈ చిత్రం గ్రాస్ కొత్త సినిమాల గ్రాస్ కంటే ఎక్కువ ఉంటుందని సవాలు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ నాలుగు వారాల్లో ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి నాలుగు వారాలు కలిపి 54 కోట్ల 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి 21 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 23 కోట్ల 11 లక్షలు , ఈస్ట్ గోదావరి నుండి 13 కోట్లు , వెస్ట్ గోదావరి నుండి 9 కోట్ల 20 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 12 కోట్ల 72 లక్షలు , కృష్ణ జిల్లా నుండి 10 కోట్ల 34 లక్షలు వచ్చాయి. ఇక రామ్ చరణ్ కి కంచుకోటగా పిలవబడే నెల్లూరు జిల్లా నుండి ఈ చిత్రానికి 5 కోట్ల 94 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఈ వీకెండ్ తో నెల్లూరు జిల్లాలో ఈ చిత్రం 6 కోట్ల షేర్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే రామ్ చరణ్ కి కంచుకోటలుగా పిలవబడే సీడెడ్ , నెల్లూరు ప్రాంతాల్లో నష్టాలు రావడం గమనార్హం. మిగిలిన ప్రాంతాల్లో కూడా నిర్మాతలు రిటర్న్ జీఎస్టీ ఇస్తేనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు ఉంటాయట. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 150 కోట్ల 36 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 233 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక నుండి 15 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, తమిళనాడు + కేరళ నుండి 2 కోట్ల 40 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 12 కోట్ల 15 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 204 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 349 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

