ఈ బ్యాంక్ లో అకౌంట్ తెరిస్తే రూ.15 లక్షలు.. ఎలా అంటే..?

మనలో చాలామంది రిస్క్ లేకుండా డబ్బులు సంపాదించాలని భావిస్తూ ఉంటారు. అలా డబ్బులు సంపాదించాలని అనుకునే వాళ్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కు సంబంధించిన అకౌంట్ ను ఓపెన్ చేస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇంట్లో పది సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఆడపిల్లలు ఉంటే ఈ స్కీమ్ కోసం అకౌంట్ ను ఓపెన్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిల పేర్లపై సుకన్య సమృద్ధి అకౌంట్ […]

Written By: Kusuma Aggunna, Updated On : June 3, 2021 8:32 am
Follow us on

మనలో చాలామంది రిస్క్ లేకుండా డబ్బులు సంపాదించాలని భావిస్తూ ఉంటారు. అలా డబ్బులు సంపాదించాలని అనుకునే వాళ్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కు సంబంధించిన అకౌంట్ ను ఓపెన్ చేస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇంట్లో పది సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఆడపిల్లలు ఉంటే ఈ స్కీమ్ కోసం అకౌంట్ ను ఓపెన్ చేస్తే మంచిదని చెప్పవచ్చు.

ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిల పేర్లపై సుకన్య సమృద్ధి అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో కనీసం 250 రూపాయలతో ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు ఒక సంవత్సర కాలంలో ఏకంగా లక్షన్నర రూపాయల వరకు డబ్బులు ఈ అకౌంట్ లో డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు సామర్థ్యం ఉన్నంత కాలం నచ్చినంత డబ్బును ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లవచ్చు.

డబ్బులు ఇన్వెస్ట్ చేసే ప్రాతిపదికను బట్టి డబ్బులు వచ్చే ప్రాతిపదిక మారే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.6 శాతం వడ్డీ లభిస్తుండటం గమనార్హం. ఎవరైతే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో చేరతారో వాళ్లు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో నెలకు 3,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 15 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.

కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు కాగా అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి 15 సంవత్సరాలు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. పోస్టాఫీస్ లేదా బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి సుకన్య సమృద్ధి అకౌంట్ ను సులభంగా తెరిచే అవకాశం ఉంటుంది.