సీనియర్ యాక్టర్లు తల్లి పాత్రల్లో కనిపించి అలరిస్తారు. పవిత్ర లోకేష్ వంటి వారు ఆంటీ, తల్లి పాత్రల్లో ఒద్దికగా కనిపించి మెరిపిస్తారు. అయితే తెరపైకి కనిపించే వీరి హోంలీ లుక్ కు .. బయట లుక్ కు చాలా డిఫెరెంట్ ఉంటుంది. ఇటీవల ప్రగతితోపాటు మరికొందరు తల్లి పాత్రధారులు సోషల్ మీడియాలో అల్ట్రామోడల్ లుక్స్ తో అదరగొడుతున్నారు. ఇప్పుడు ఆ స్థానంలోకి ప్రగతి వచ్చి చేరింది.
టీవీ సీరియళ్లు లేదా టీవీ షో లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్న పవిత్ర లోకేశ్ ఇప్పుడు తెలుగులో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఈమె ప్రస్తుతం టాలీవుడ్ లో తల్లిగా, అత్తగా పలు సినిమాల్లో నటించింది.
రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్ కు తల్లిగా నటించిన ఈమెను చూసి అందరూ మెచ్చుకున్నారు. ఆ తరువాత కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే పవిత్రా ఒకప్పటి స్టార్ హీరోయిన్ అన్న విషయం కొందరికే తెలుసు. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పవిత్ర 16 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.1995లో మిస్టర్ అభిషేక్ సినిమాతో కన్నడ సినిమాలోకి అడుగుపెట్టిన ఈమె హీరోయిన్ గా పలు సినిమాల్లో చేసింది. ఆ కాలంలోనే గ్లామర్ పాత్రలు చేసి సినీ ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు, కన్నడం కలిపి మొత్తం 150 చిత్రాలకు పైగానే నటించారు. ముఖ్యంగా తెలుగులో 20 కి పైగా చిత్రాలో అలరించారు.
తెలుగులో రేసుగుర్రం, టెంపర్, చిత్రలహరి, మిస్టర్, మజ్ను, తేజ్ ఐ లవ్యూ, ఎంసీఏ, సన్నాఫ్ సత్యమూర్తి, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, చిత్రాల్లో అలరించారు. పవిత్ర సోదరుడు ఆది లోకేశ్, భర్త సుచేంద్ర ప్రసాద్ ఇద్దరు నటులే. పవిత్రకు ఓ పాప కూడా ఉంది. తాజాగా ఆమెకు సంబందించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్న ఆమె పాత ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.