https://oktelugu.com/

పాపం ‘క్రేజీ బ్యూటీ’.. అక్కడ ఇక కష్టమే !

‘క్రేజీ బ్యూటీ రష్మిక మండన్నా’ మొత్తానికి తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే.. అటు తమిళ ఇండస్ట్రీలోనూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే సుల్తాన్ అనే మంచి సినిమాతోనే తమిళంలోకి అడుగుపెట్టబోతున్నా.. ఆమెకు మాత్రం ఆ సినిమాలో పెద్దగా పేరు వచ్చేలా లేదట. తానూ నటించిన ఫస్ట్ తమిళ్ మూవీలో తనకు సరైన ప్రాధాన్యత లేకపోవడం పై ఇప్పటికే రష్మిక తెగ ఫీల్ అయిపోతుందట. Also Read: ఆచార్య ఫస్ట్ లుక్: చిరంజీవితో కలిసి తుపాకీ […]

Written By:
  • admin
  • , Updated On : March 27, 2021 / 10:01 AM IST
    Follow us on


    ‘క్రేజీ బ్యూటీ రష్మిక మండన్నా’ మొత్తానికి తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే.. అటు తమిళ ఇండస్ట్రీలోనూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే సుల్తాన్ అనే మంచి సినిమాతోనే తమిళంలోకి అడుగుపెట్టబోతున్నా.. ఆమెకు మాత్రం ఆ సినిమాలో పెద్దగా పేరు వచ్చేలా లేదట. తానూ నటించిన ఫస్ట్ తమిళ్ మూవీలో తనకు సరైన ప్రాధాన్యత లేకపోవడం పై ఇప్పటికే రష్మిక తెగ ఫీల్ అయిపోతుందట.

    Also Read: ఆచార్య ఫస్ట్ లుక్: చిరంజీవితో కలిసి తుపాకీ పట్టిన రాంచరణ్

    సుల్తాన్ లో కార్తీ హీరో. ఈ సినిమా వచ్చే నెల 2న విడుదల కానుంది. ఇప్పటికే సుల్తాన్ ట్రైలర్ కూడా వచ్చింది. ట్రైలర్ లో రష్మికకు బాగానే స్పెస్ ఇచ్చారు. కానీ సినిమాలో మాత్రం ఆమెకు ఆ అవకాశం ఉండేలా కనబడటం లేదు. తెలుగులో ఆమెకి ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని రష్మికని మొదట ఈ సినిమాలో మెయిన్ ఫిమేల్ లీడ్ గా తీసుకున్నా.. సరైన టైంకి డేట్స్ ఇవ్వకుండా కాస్త ఈ చిత్రబృందాన్ని ఇబ్బంది పెట్టిందట.

    దాంతో సుల్తాన్ మేకర్స్.. రష్మిక పాత్రను తగ్గించుకుంటూ పోయారు. ఇప్పుడు చూస్తే ఆమెది గెస్ట్ రోల్ లాగా ఉందట. పైగా మరో హీరోయిన్ హైలైట్ అయ్యేలా ఉందట. దాంతో తమిళంలో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని ఆశ పడిన రష్మికకు సుల్తాన్ బాగానే హ్యాండ్ ఇచ్చాడు. అయినా చెప్పిన టైంకు డేట్స్ ఇచ్చి ఉంటే.. ముందు చేపినట్టే ఆమె క్యారెక్టర్ తగిన ప్రాధాన్యత ఇచ్చి ఉండేవాళ్ళు. అయితే తమిళ్ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమాలో రష్మికను తీసుకోవాలనుకున్నారు. ఆమెకి ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చారని టాక్.

    Also Read: మార్షల్ ఆర్ట్స్ పై పవన్ ప్రేమ ఎంతంటే?

    కానీ, సుల్తాన్ లో ఆమె పాత్ర పై తమిళ ఇండస్ట్రీలో రూమర్స్ మొదలవ్వడంతో ఫైనల్ గా విజయ్ సినిమాలో ఛాన్స్ పూజ హెగ్డేకి వెళ్ళిపోయిందట. విజయ్ 65వ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డేను నిర్మాతలు ఆల్ రెడీ ప్రకటించారు. పాపం రష్మికకు ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్