https://oktelugu.com/

సాయిపల్లవితో ప్రేమలో పడిన దర్శకుడు !

క్రేజీ హీరోయిన్ గా చాలామంది చలామణి అవుతారు. అయితే సహజనటి అనే ఇమేజ్ ను మాత్రం జనరేషన్ కి ఒకరో ఇద్దరో మాత్రమే తెచ్చుకోగలరు. ఈ జనరేషన్ లో సహజనటి అంటే ‘సాయి పల్లవి’నే. కాగా సాయి పల్లవి వ్యక్తిత్వం చాల మంచింది అని ఆమెతో పని చేసిన వారు చెబుతుంటారు. అయితే ఆమె క్యారెక్టర్ కి ఒక దర్శకుడు తెగ కనెక్ట్ అయిపోయాడట. సాయిపల్లవికి అతను పెళ్లి ప్రపోజల్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది. కాని సాయి […]

Written By:
  • admin
  • , Updated On : April 2, 2021 / 08:23 PM IST
    Follow us on


    క్రేజీ హీరోయిన్ గా చాలామంది చలామణి అవుతారు. అయితే సహజనటి అనే ఇమేజ్ ను మాత్రం జనరేషన్ కి ఒకరో ఇద్దరో మాత్రమే తెచ్చుకోగలరు. ఈ జనరేషన్ లో సహజనటి అంటే ‘సాయి పల్లవి’నే. కాగా సాయి పల్లవి వ్యక్తిత్వం చాల మంచింది అని ఆమెతో పని చేసిన వారు చెబుతుంటారు. అయితే ఆమె క్యారెక్టర్ కి ఒక దర్శకుడు తెగ కనెక్ట్ అయిపోయాడట. సాయిపల్లవికి అతను పెళ్లి ప్రపోజల్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది. కాని సాయి పల్లవి మాత్రం అతని ప్రేమను సున్నితంగా తిరస్కరించిందట.

    అయినా సాయి పల్లవి ప్రేమాయణం గురించి గతంలోనే అనేక రూమర్స్ వచ్చాయి. ఒక తమిళ దర్శకుడితో ఆమె ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆ దర్శకుడు ఎవరో కాదు, తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ అని కూడా కోలీవుడ్ మీడియాలో వినిపించింది. అయితే ఆ తరువాత విజయ్ మరో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయాడు. కానీ, అతనితో మాత్రం సాయి పల్లవి కొన్నాళ్ల పాటు సాన్నిహిత్యంగా ఉందట.

    కోలీవుడ్ గ్లామర్ భామ అమల పాల్ మాజీ భర్త అయిన ఏ ఎల్ విజయ్, అమలాపాల్ తో విడిపోయిన తరువాత.. కొన్నాళ్ల పాటు డిప్రెషన్ లో ఉన్నాడట. ఆ సమయంలోనే అతను సాయి పల్లవితో ‘కణం’ అనే సినిమా చేస్తున్నాడు. భిన్నమైన సినిమాగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సాయిపల్లవి మంచి తనానికి అతను ఫిదా అయిపోయాడని.. అప్పట్లో సాయిపల్లవి కూడా విజయ్ తో సన్నిహితంగా ఉండేది అని, కానీ ఆ సినిమా ప్లాప్ తరువాత వీరిద్దరి బంధం కూడా ప్లాప్ గా ముగిసిందట.

    మొత్తానికి సాయి పల్లవి ప్రేమాయణం గురించిన న్యూస్ సోషల్ మీడియాలో గత కొన్ని నెలలుగా అనేక రకాలుగా న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. మరోపక్క సాయి పల్లవి అభిమానులు మాత్రం ఆమెకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.