https://oktelugu.com/

‘మర్డర్‌’ సినిమా విడుదలకు అనుమతి

రామ్‌గోపాల్‌ నిర్మించిన ‘మర్డర్‌’ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. ప్రేమ వ్యవహారంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ హత్య చేయబడ్డాడు. ఈ సంఘటన నేపథ్యంలో ఆర్‌జీవి ‘మర్డర్‌’ నిర్మించాడు. అయితే ఈ సినిమా విడుదల చేయొద్దని ప్రణయ్‌ సతీమణి అమృత, ఆమె అత్తింటివారు నల్గొండ కోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా వల్ల తమకు అన్యాయం జరిగే అవకాశ ముందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో నల్గొండ కోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. దీంతో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 6, 2020 2:59 pm
    Follow us on

    రామ్‌గోపాల్‌ నిర్మించిన ‘మర్డర్‌’ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. ప్రేమ వ్యవహారంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ హత్య చేయబడ్డాడు. ఈ సంఘటన నేపథ్యంలో ఆర్‌జీవి ‘మర్డర్‌’ నిర్మించాడు. అయితే ఈ సినిమా విడుదల చేయొద్దని ప్రణయ్‌ సతీమణి అమృత, ఆమె అత్తింటివారు నల్గొండ కోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా వల్ల తమకు అన్యాయం జరిగే అవకాశ ముందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో నల్గొండ కోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. దీంతో హైకోర్టుకెక్కిన వర్మ అయితే ఇది కుల హత్యలపై జరుగుతున్న సినిమా అని, కేవలం కల్పితమేనని వర్మ వివరణ ఇచ్చాడు. దీంతో హైకోర్టు షరతులతో సినిమా విడుదలకు అనుమతినిచ్చింది.