https://oktelugu.com/

RRR Oscar Hopes : ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ఆశలు ఇంకా బ్రతికే ఉన్నాయి… ఇలా బరిలో దిగవచ్చు!

RRR’s Oscar hopes: కొన్నినెలలుగా సోషల్ మీడియాలో ఆర్ ఆర్ ఆర్ హీరోలకు ఆస్కార్ అవార్డులు అంటూ పెద్ద చర్చ నడుస్తోంది. ఈ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ట్విట్టర్ లో కొట్టుకుంటున్నారు. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీ ఆస్కార్ కి ఎంపికయ్యే ఆస్కారం ఉన్న జాబితాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పేరు చేర్చాయి. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు సంబరపడిపోయారు. అలాగే ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి హాలీవుడ్ ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కాయి. ఎన్టీఆర్, […]

Written By:
  • Shiva
  • , Updated On : September 21, 2022 / 12:36 PM IST

    RRR - Chhello

    Follow us on

    RRR’s Oscar hopes: కొన్నినెలలుగా సోషల్ మీడియాలో ఆర్ ఆర్ ఆర్ హీరోలకు ఆస్కార్ అవార్డులు అంటూ పెద్ద చర్చ నడుస్తోంది. ఈ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ట్విట్టర్ లో కొట్టుకుంటున్నారు. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీ ఆస్కార్ కి ఎంపికయ్యే ఆస్కారం ఉన్న జాబితాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పేరు చేర్చాయి. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు సంబరపడిపోయారు. అలాగే ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి హాలీవుడ్ ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనతో పాటు రాజమౌళి టేకింగ్ అద్భుతమని వారు కొనియాడారు. ఇన్ని అనుకూల పరిణామాల మధ్య ఆర్ ఆర్ ఆర్ కి ఒకటి రెండు విభాగాల్లో ఆస్కార్ దక్కడం ఖాయమని భావించారు.

    RRR-Oscar-Award

    అయితే అందరి ఆశలపై ఇండియన్ జ్యూరీ సభ్యులు నీళ్లు చల్లారు. భారత్ నుండి ఆస్కార్ నామినేషన్స్ లో ఆర్ ఆర్ ఆర్ కి చోటు దక్కలేదు. గుజరాతీ ఫిల్మ్ చెల్లో షో (లాస్ట్ ఫిల్మ్ షో) ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. దీంతో ఆర్ ఆర్ ఆర్ ప్రేమికులు పూర్తి నిరాశకు గురయ్యారు. ఆస్కార్ కొడుతుందనుకున్న మూవీ కనీసం నామినేట్ కాకపోవడంతో డీలా పడ్డారు. అయితే ఆర్ ఆర్ ఆర్ కి ఆస్కార్ దారులు పూర్తిగా మూసుకు పోలేదని తెలుస్తుంది.

    Also Read: Chiranjeevi- Mohan Babu: చిరంజీవి కుమారుడికి, మోహన్ బాబు కుమారులకు అదే తేడా

    Oscar Movie Chhello

    ఆస్కార్ బరిలో దిగడానికి ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ కి మరో మార్గం ఉంది. అకాడమీ నిబంధనల ప్రకారం లాస్ ఏంజెల్స్ నగరంలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వారానికి పైగా ప్రదర్శించినబడిన ఏ చిత్రమైనా జనరల్ ఎంట్రీ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్ కి అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 15వ తేదీ వరకు ఈ అవకాశం ఉంది. కాబట్టి ఈ నిబంధన ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ఆశలు నిలిపింది. హాలీవుడ్ ప్రేక్షకుల నుండి ఆర్ ఆర్ ఆర్ మూవీకి భారీగా ఆదరణ దక్కిన నేపథ్యంలో మేకర్స్ కచ్చితంగా అప్లై చేస్తారనడంలో సందేహం లేదు.

    దర్శకుడు రాజమౌళి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆర్ ఆర్ ఆర్ రూపొందించారు. నిర్మాత డివివి దానయ్య రూ. 400 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించగా… అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా చేశారు. అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేశారు. కీరవాణి సంగీతం అందించారు. ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది.

    Also Read: Khammam Husband And Wife: ప్రియుడితో ఇంజక్షన్ వేయించి భర్తను చంపించింది.. ఏం ఎఫైర్ రా బాబూ ఇదీ.. 

    Recommended videos:


    Tags