https://oktelugu.com/

ప్రముఖ హీరో పృథ్వీరాజ్ కు కరోనా పాజిటివ్‌

  కరోనా మహమ్మారి సినీ ప్రముఖులకు సోకి వణికిస్తోంది. తాజాగా మళయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ‘అక్టోబర్‌ 7 నుంచి జనగణమన అనే చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నాను. షూటింగ్‌ సమయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. చివరగా కోర్ట్‌ ఎపిసోడ్‌ జరగగా అది పూర్తయిన తరువాత మళ్లీ టెస్టులు చేయించుకోవడంతో పాజిటివ్‌గా నిర్దరణ అయింది’ అని ఆయన సోషల్‌ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 20, 2020 / 03:23 PM IST
    Follow us on

     

    కరోనా మహమ్మారి సినీ ప్రముఖులకు సోకి వణికిస్తోంది. తాజాగా మళయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ‘అక్టోబర్‌ 7 నుంచి జనగణమన అనే చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నాను. షూటింగ్‌ సమయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. చివరగా కోర్ట్‌ ఎపిసోడ్‌ జరగగా అది పూర్తయిన తరువాత మళ్లీ టెస్టులు చేయించుకోవడంతో పాజిటివ్‌గా నిర్దరణ అయింది’ అని ఆయన సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.