https://oktelugu.com/

టాలీవుడ్ బుట్టబొమ్మ.. బాలీవుడ్లో ‘సర్కస్’ చేయనుందా?

జయాపజయాలతో సంబంధం లేకుండా చిత్రసీమలో కొందరు హీరోయిన్లు దూసుకెళుతూ ఉంటారు. ఆ జాబితాలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే చేరినట్లు కన్పిస్తోంది. ఈ భామ టాలీవుడ్లో స్టార్ హీరోల నటిస్తూనే బాలీవుడ్లో క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటోంది. Also Read: మీడియా వర్సెస్ బాలీవుడ్.. చివరికీ ఏం కానుంది? పూజాహెగ్డే ఇప్పటికే టాలీవుడ్లోని స్టార్ హీరోలైన మహేష్ బాబు.. అల్లు అర్జున్.. రాంచరణ్.. ఎన్టీఆర్ సరసన ఆడిపాడింది. ప్రస్తుతం ప్రభాస్ కు జోడీగా ‘రాధేశ్యామ్’ మూవీలో నటిస్తుంది. దీంతోపాటు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 20, 2020 / 03:28 PM IST
    Follow us on

    జయాపజయాలతో సంబంధం లేకుండా చిత్రసీమలో కొందరు హీరోయిన్లు దూసుకెళుతూ ఉంటారు. ఆ జాబితాలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే చేరినట్లు కన్పిస్తోంది. ఈ భామ టాలీవుడ్లో స్టార్ హీరోల నటిస్తూనే బాలీవుడ్లో క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటోంది.

    Also Read: మీడియా వర్సెస్ బాలీవుడ్.. చివరికీ ఏం కానుంది?

    పూజాహెగ్డే ఇప్పటికే టాలీవుడ్లోని స్టార్ హీరోలైన మహేష్ బాబు.. అల్లు అర్జున్.. రాంచరణ్.. ఎన్టీఆర్ సరసన ఆడిపాడింది. ప్రస్తుతం ప్రభాస్ కు జోడీగా ‘రాధేశ్యామ్’ మూవీలో నటిస్తుంది. దీంతోపాటు అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లోనూ నటిస్తోంది.

    తెలుగులో వరుస అవకాశాలతో దూసుకెళుతున్న పూజా హెగ్డే హిందీలోనూ క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటోంది. ఇప్పటికే ఈ భామ బాలీవుడ్ స్టార్ హీరోలైన హృతిక్ రోషన్.. అక్షయ్ కుమార్ చిత్రాల్లో నటించింది. తాజాగా రోహిత్ శెట్టి తెరకెక్కించనున్న ఓ బడా మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపికైంది.

    బాలీవుడ్లో రోషిత్ శెట్టికి హిట్ మ్యాన్ గా పేరుంది. గతంలో రోహిత్ శెట్టి తెరకెక్కించిన ‘గోల్ మాల్’ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. తాజాగా కొత్త కామెడీ కథతో ‘సర్కస్’ మూవీని తెరకెక్కించేందుకు రోహిత్ శెట్టి సిద్ధమవుతున్నాడు.

    ఈ మూవీలో రణ్విర్ సింగ్ హీరోగా నటిస్తుండగా పూజాహెగ్డే హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకుంది. ‘సర్కస్’ మూవీకి మరిన్ని సీరీసులు కూడా ఉండబోతున్నాయట. దీంతో పూజా హెగ్డే పంటపండిందనే టాక్ బాలీవుడ్ వర్గాల్లో విన్పిస్తోంది.

    Also Read: బిగ్ బాస్-4: రచ్చ చేసిన అరియానా-మోహబూబ్.. ఈ వారం ఎవరు ఔట్?

    బాలీవుడ్ బడా నిర్మాత భూషణ్ కుమార్ ‘సర్కాస్’ మూవీని నిర్మిస్తున్నాడు. పూజా హెగ్డేకు బాలీవుడ్లో సరైన హిట్టు లేకపోయినా బడా ఆఫర్లు దక్కించుకుంటూ ముందుకెళుతోంది. దీంతో పూజా హెగ్డే ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.