
టాలీవుడ్ హీరోయిన్, మిల్క్ బ్యూటీ తమన్నాకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడగా తాజాగా తమన్నాకు ఈ వైరస్ సోకినట్లు నిర్దారణ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమన్నాకు కరోనా సోకిందనే విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు షాక్ తిన్నారు.ఈ సందర్భంగా ఆమె త్వరగా కోలుకోవాలనిప్రారిర్థస్తున్నారు. కొద్దిరోజుల క్రితం తమన్నా తల్లిదండ్రులకు కరోనా లక్షణలు కనిపించడంతో వారు టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. మిగిలిన సిబ్బందికి నెగెటివ్ వచ్చింది. కాగా ప్రస్తుతం తమన్నాకు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది.
Also Read: బిగ్ బాస్ కాదు బ్యాడ్ బాస్.. అన్యాయంగా ఇద్దరి ఎలిమినేషన్..?