https://oktelugu.com/

తెలంగాణలో స్కూళ్లు తెరుచుకునేది అప్పుడే..

కరోనాతో విద్యార్థుల చదువులు కూడా ఆగమాగం అయ్యాయి. వైరస్‌ ధాటికి విద్యార్థులకు ఎగ్జామ్స్‌ పెట్టలేని పరిస్థితి. దీంతో పరీక్షలు లేకుండా విద్యార్థులను పై చదువులకు ప్రమోట్‌ చేశారు. దేశంలో కరోనా ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. ఇటీవల అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాల్లోనూ స్కూళ్లు ఓపెన్‌ చేసుకునే రాష్ట్ర ప్రభుత్వాలదే ఫైనల్‌ అని చెప్పింది. దీంతో ఏపీ ప్రభుత్వం నవంబర్‌‌ 2 నుంచి స్కూల్స్‌ తెరవాలని భావిస్తుండగా.. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే రోజు తెరవాలని అనుకుంటున్నట్లు తెలిసింది. Also […]

Written By:
  • NARESH
  • , Updated On : October 4, 2020 / 01:13 PM IST
    Follow us on

    కరోనాతో విద్యార్థుల చదువులు కూడా ఆగమాగం అయ్యాయి. వైరస్‌ ధాటికి విద్యార్థులకు ఎగ్జామ్స్‌ పెట్టలేని పరిస్థితి. దీంతో పరీక్షలు లేకుండా విద్యార్థులను పై చదువులకు ప్రమోట్‌ చేశారు. దేశంలో కరోనా ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. ఇటీవల అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాల్లోనూ స్కూళ్లు ఓపెన్‌ చేసుకునే రాష్ట్ర ప్రభుత్వాలదే ఫైనల్‌ అని చెప్పింది. దీంతో ఏపీ ప్రభుత్వం నవంబర్‌‌ 2 నుంచి స్కూల్స్‌ తెరవాలని భావిస్తుండగా.. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే రోజు తెరవాలని అనుకుంటున్నట్లు తెలిసింది.

    Also Read: ‘పరువు’ హత్యలకు పోయి సాధించిందేంటి..?

    అయితే.. స్కూళ్లు తెరవాలని ప్రభుత్వాలు అనుకుంటున్నా విద్యార్థులను పంపించేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారా..? విద్యార్థలు ఇష్ట ప్రకారమే అంటూ కేంద్రం కూడా మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఏపీలో 9వ తరగతి నుంచి ఇంటర్‌‌ వరకు అక్టోబర్‌‌ 5 నుంచి తెరవాలనుకున్నారు. కానీ.. విద్యార్థులు, పేరెంట్స్‌ నుంచి రెస్పాన్స్‌ రాకపోవడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.

    ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనా కేసులు తక్కువే. స్కూళ్లు తెరిచేందుకు ఇంకో నెల సమయం కూడా ఉంది. కానీ.. ఈ నెల రోజుల్లో కరోనా పూర్తిస్థాయి కంట్రోల్‌లోకి వస్తుందా అంటే అది ఎవరికీ తెలియదు. ప్రభుత్వం మాత్రం కరోనా కంట్రోల్‌లోకి వచ్చి తల్లిదండ్రులు పిల్లల్ని స్కూళ్లకు పంపిస్తారనే భావిస్తోంది.

    Also Read: కరోనా నుంచి కోలుకొనే పరిస్థితి లేదా?

    అయితే.. స్కూళ్ల తెరిచే విషయంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రులు గంగుల కమలాకర్‌‌, కొప్పుల ఈశ్వర్‌‌, సత్యవతి రాథోడ్‌లు ఈనెల 7న మరోసారి సమావేశం కానున్నారట. ఓ నివేదిక తయారు చేసి సీఎంకు ఇవ్వనున్నారు. అప్పుడు కేసీఆర్‌‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తే స్కూళ్లు తెరవాలని విద్యాశాఖ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.  కేసీఆర్‌‌ ఓకే చెబితే నవంబర్‌‌ 2 నుంచి 9,10 తరగతులతోపాటు జూనియర్ కాలేజీలు, ఇతర కాలేజీలు తెరవాలనుకుంటున్నారు. తెలంగాణలో రికవరీ రేటు ఓ స్థాయిలో ఉండడంతో ప్రజల్లోనూ భయం పోయిందని, తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపించే అవకాశాలే ఉన్నాయని ప్రభుత్వ పెద్దలు అనుకుంటున్నారు. కొన్ని సర్వేల ప్రకారం మాత్రం.. ఈ ఏడాది తమ పిల్లలను స్కూళ్లకు పంపించేది లేదంటూ స్పష్టం చేస్తున్నాయి. ఈ విద్యాసంవత్సరం పోయినా పర్లేదని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో సర్కార్‌‌ నిర్ణయం ఎలా ఉండబోతోంది..? పిల్లలను పంపిస్తారా..? అసలు స్కూళ్ల తెరుచుకుంటాయా..? తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.