ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య 98 కిలోల బరువు తగ్గాడు. ఇప్పడు ఆయన చాలా నాజుగ్గా తయారయ్యాడు. హెవీ వెయిట్ తో ఉన్న గణేశ్ డ్యాన్స్ అదరగొట్టేవాడు. ఇకప్పడు రెండు వందల కిలోలు ఉండే ఆయన ఇంత భారీగా వెయిట్ తగ్గంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన కపిల్ శర్మ కార్యక్రమంలో కోరియోగ్రాఫర్ గీతాకపూర్, లూయిస్ తో కలిసి గణేశ్ పాల్గొన్నారు. ఆయన లుక్ ను చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ సందర్బంగా ఆ షో కు వ్యాఖ్యతగా వ్యవహరించే కపిల్ శర్మ ‘మీరెన్ని కిలోలు తగ్గారు…’ అని గణేశ్ ను అడగ్గా ‘ఓ 98 కిలోలు తగ్గాను‘ అని తెలిపారు. దీంతో గణేశ్ ఆచార్య ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.