https://oktelugu.com/

రైతు సంఘాలు, కేంద్రానికి సుప్రీం నోటీసులు

కేంద్ర వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటంపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ సాగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరపాలని ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సమస్య పరిష్కారం కోసం కమిటీ వేయాలని కేంద్రానికి సూచించింది. అలాగే కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు, రైతు సంఘాలకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీకి చెందిన రిషబ్ శర్మ ఆందోళన చేస్తున్న రైతులను తరలించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ […]

Written By: , Updated On : December 16, 2020 / 03:40 PM IST
Follow us on

కేంద్ర వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటంపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ సాగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరపాలని ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సమస్య పరిష్కారం కోసం కమిటీ వేయాలని కేంద్రానికి సూచించింది. అలాగే కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు, రైతు సంఘాలకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీకి చెందిన రిషబ్ శర్మ ఆందోళన చేస్తున్న రైతులను తరలించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ బొబ్డే ధర్మాసనం రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కమిటీ వేసుకొని సమస్య పరిష్కరించుకోవాలన్నారు. అన్నదాతల ఆందోళనకు సంబంధించిన అన్ని పిటిషన్లపు కలిపి విచారిస్తామని పేర్కొంది. ఈ మేరకు నోటీసులపై రేపు సమాధానాలివ్వాలని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.