https://oktelugu.com/

క్రిస్మస్ స్పెషల్ ఫ్రూట్ కేక్ తయారీ విధానం మీకు తెలుసా..?

  ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 న యేసుక్రీస్తు పుట్టిన సందర్భంగా క్రిస్టమస్ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. క్రిస్టమస్ రోజున ఒకరికొకరు బహుమతులను ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలను తెలుపుకుంటారు.ముఖ్యంగా ఈ క్రిస్టమస్ కి ప్రత్యేకంగా కేకులు తయారుచేసి తమ బంధు మిత్రులకు పంపుతారు.ఇందులో భాగంగానే ఫ్రూట్ కేక్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం… ఫ్రూట్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్ధాలు: *మైదా_ 4 కప్పులు *పంచదార_రెండుకప్పులు *జీడి పప్పు_అర […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 20, 2020 1:19 pm
    Follow us on

     

    ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 న యేసుక్రీస్తు పుట్టిన సందర్భంగా క్రిస్టమస్ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. క్రిస్టమస్ రోజున ఒకరికొకరు బహుమతులను ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలను తెలుపుకుంటారు.ముఖ్యంగా ఈ క్రిస్టమస్ కి ప్రత్యేకంగా కేకులు తయారుచేసి తమ బంధు మిత్రులకు పంపుతారు.ఇందులో భాగంగానే ఫ్రూట్ కేక్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…

    ఫ్రూట్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్ధాలు:

    *మైదా_ 4 కప్పులు
    *పంచదార_రెండుకప్పులు
    *జీడి పప్పు_అర కప్పు
    *మినీ లైసెన్స్_ కొద్దిగా
    *బటర్ _ ఒక కప్పు
    *బేకింగ్ పౌడర్_ఒక టీస్పూన్
    *జాజికాయ పొడి_అర టీ స్పూన్
    *కోడిగుడ్లు_ 5
    *ఎండు ద్రాక్ష
    *ఖర్జూర పండ్లు

    తయారు చేసే విధానం:

    ముందుగా ఎండు ద్రాక్ష, ఖర్జూర పండ్లను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. జీడిపప్పును మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్ లో ఉంచుకోవాలి. ఒక గిన్నెలో మైదాపిండి వేసి ఉంచుకోవాలి. ముందుగా బెటర్ పంచదార మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మైదా పిండిలోకి వేసి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులో కోడిగుడ్డు తెల్లసొన మాత్రమే వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో బేకింగ్ పౌడర్ కొద్దికొద్దిగా వేసుకుంటూ పిండి ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమం లో గుడ్డు పచ్చసొన వేసి బాగా కలిపిన తరువాత దీనిపై చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న నట్స్ వేయాలి. తర్వాత వెనీలా ఎసెన్స్, జాజికాయ పౌడర్ వేసి బట్టర్ పేపర్ పై కొద్దిగా నెయ్యి వేసి బేకింగ్ డిష్ ఆశ్రమాన్ని దాదాపు అరగంట పాటు ఓవెన్లో వేడి చేయాలి. ఈ విధంగా మన ఇంట్లోనే క్రిస్మస్ పండుగకు ఇలాంటి ఫ్రూట్ కేక్ తయారు చేసుకుని ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా ఈ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవచ్చు.