https://oktelugu.com/

మితంగా భోజనం చేసి బరువు తగ్గాలనుకుంటున్నారా.. చిట్కాలివే..?

మనలో చాలామంది బరువు తగ్గాలని అనుకుంటూ ఉంటారు. కొందరు బరువు తగ్గడం కోసం వ్యాయామాలు చేస్తే మరి కొందరు మితంగా ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అయితే మితంగా ఆహారం తీసుకోవాలని అనుకున్నా రుచికరమైన వంటలు కనిపిస్తే మాత్రం కడుపు నిండా తినేస్తారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గడంతో పాటు మితంగా ఆహారం తీసుకోవడం సాధ్యమవుతుంది. Also Read: వంశపారంపర్యంగా కేన్సర్ వస్తుందా.. వాస్తవమేమిటంటే..? మితంగా ఆహారం తీసుకోవాలని భావించే వాళ్లు భోజనం చేసే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 22, 2021 / 01:05 PM IST
    Follow us on

    మనలో చాలామంది బరువు తగ్గాలని అనుకుంటూ ఉంటారు. కొందరు బరువు తగ్గడం కోసం వ్యాయామాలు చేస్తే మరి కొందరు మితంగా ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అయితే మితంగా ఆహారం తీసుకోవాలని అనుకున్నా రుచికరమైన వంటలు కనిపిస్తే మాత్రం కడుపు నిండా తినేస్తారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గడంతో పాటు మితంగా ఆహారం తీసుకోవడం సాధ్యమవుతుంది.

    Also Read: వంశపారంపర్యంగా కేన్సర్ వస్తుందా.. వాస్తవమేమిటంటే..?

    మితంగా ఆహారం తీసుకోవాలని భావించే వాళ్లు భోజనం చేసే ముందు గ్లాసు నీళ్లను తాగాలి. క్యాలరీలు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. లీన్ ప్రోటీన్ ను ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఆహారాన్ని ఎప్పుడూ పెద్ద ప్లేట్లలో కాకుండా చిన్న ప్లేట్లలో తీసుకోవడానికి ప్రయత్నించాలి. చిన్న ప్లేట్లలో ఆహారం తీసుకోవడం వల్ల తక్కువ మొత్తం తినే అవకాశం ఉంటుంది.

    Also Read: రేగు పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

    ఫ్యాట్లు, షుగర్‌, ఉప్పు వీలైనంత తక్కువగా తీసుకోవాలి. తీపి పదార్థాలను తరచూ తినాలని అనిపిస్తుంటే స్వీట్‌ డెజర్టు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో పాల ఉత్పత్తులు, పండ్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్యాకేజింగ్ ఫుడ్ ను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. కొవ్వు ఉన్న ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    ఆహారం తీసుకుంటూ బరువు తగ్గాలని అనుకుంటే మాత్రం తగిన వ్యాయామాలు చేస్తూ డైట్ లో మార్పులు చేసుకోవాలి. కార్బోహెడ్రేట్లు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకున్నా బరువు తగ్గకపోతే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.