https://oktelugu.com/

క్రిస్మస్ కేకులను రుచిగా ఏ విధంగా తయారు చేసుకోవాలంటే..?

భారతదేశం విభిన్న జాతుల సమ్మేళనం అని చెప్పవచ్చు. భిన్నత్వంలో ఏకత్వంలో ఉంటూ ప్రతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే రాబోయే క్రిస్మస్ వేడుకలను కూడా భారతదేశంలో పెద్ద ఎత్తున జరుపుకుంటారు. క్రైస్తవులు సంవత్సరానికి ఒక్కసారి ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో అతి పెద్ద పండుగ క్రిస్మస్ అని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న యేసు క్రీస్తు పుట్టిన రోజును పురస్కరించుకుని క్రైస్తవ మతస్థులు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులందరూ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 20, 2020 / 01:29 PM IST
    Follow us on

    భారతదేశం విభిన్న జాతుల సమ్మేళనం అని చెప్పవచ్చు. భిన్నత్వంలో ఏకత్వంలో ఉంటూ ప్రతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే రాబోయే క్రిస్మస్ వేడుకలను కూడా భారతదేశంలో పెద్ద ఎత్తున జరుపుకుంటారు. క్రైస్తవులు సంవత్సరానికి ఒక్కసారి ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో అతి పెద్ద పండుగ క్రిస్మస్ అని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న యేసు క్రీస్తు పుట్టిన రోజును పురస్కరించుకుని క్రైస్తవ మతస్థులు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

    కుటుంబ సభ్యులందరూ కలసి చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. క్రిస్మస్ అంటేనే కేకులు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తాయి. చాలా చోట్ల క్రిస్మస్ ట్రీ లను, ఏర్పాటు చేసి ఎంతో ఆనందంగా ఈ పండుగ జరుపుకుంటారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బయటి నుంచి తెచ్చే కేక్ కన్నా ఈ పండుగ ప్రత్యేకమైన కేకులను మన ఇంట్లోనే తయారు చేసి బంధువులకు, స్నేహితులకు పంచుతుంటారు. ఇందులో భాగంగానే ఈ క్రిస్మస్ కు మన ఇంట్లోనే స్వయంగా కేక్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం…

    డ్రై ఫ్రూట్స్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

    *డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం, వాల్ నట్స్)

    *మైదాపిండి _ ఒక కప్పు

    *పాల పౌడర్_ఒక కప్పు

    *పాలు_ ఒక కప్పు

    *వెనీలా ఎసెన్స్_కొద్దిగా

    *నెయ్యి_3 టేబుల్ స్పూన్లు

    *బేకింగ్ సోడా_టీ స్పూన్

    *బేకింగ్ పౌడర్_టీ స్పూన్

    తయారీ విధానం:

    మొదటగా ఒక గిన్నెలో మైదాపిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, చక్కెర అన్నింటిని పాలుపోసి ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. వేడిచేసిన డ్రైఫ్రూట్స్ ఆ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టాలి. అరగంట తర్వాత బేకింగ్ ట్రే లో బట్టర్ పేపర్ పై కొద్దిగా నెయ్యి వేసి పేపర్ మొత్తం పూయాలి. తర్వాత ఆ మిశ్రమం మొత్తం బేకింగ్ ట్రేలో వేసి180 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ముందుగానే హిట్ చేసి పెట్టుకున్న మైక్రోఓవెన్ లో 45 నిమిషాల పాటు ఉంచాలి.తరువాత బయటకు తీసి పది నిమిషాల పాటు ఉంచిన తర్వాత ఎంతో రుచికరమైన డ్రైఫ్రూట్స్ కేక్ తయారవుతుంది. ఈ విధంగా మన ఇంట్లోనే తయారుచేసుకుని క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకోవచ్చు.