TDP Mahanadu 2022: పసుపు దండు పండుగ మహానాడు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకూ మహానాడును తెలుగు తమ్ముళ్లు పండుగలా జరుపుకుంటూ వస్తున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అయితే గండిపేట వేదికగా నిలిచేది. అటు తరువాత పార్టీలో జరిగిన కీలక పరిణామాలతో ఈ వేదిక మారుతూ వచ్చింది. రాష్ట్ర విభజన తరువాత అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏడాదికి ఒక చోట నిర్వహిస్తున్నారు. కొవిడ్ తో గత రెండేళ్లుగా పసుపు పండుగ నిర్వహించలేదు. ఈ ఏడాది ఒంగోలులో నిర్వహించాలని నిర్ణయించారు. రెండురోజుల పాటు నిర్వహించనున్న వేడుకకు ఉభయ రాష్ట్రాల్లో 4 వేల మంది ప్రతినిధులకు ఆహ్వానం పంపారు. అంతవరకూ బాగానే ఉంది కానీ.. మహానాడుకు అన్నగారి కుటుంబసభ్యులను తేవాలని సగటు టీడీపీ అభిమాని కోరుతున్నాడు. ప్రస్తుతం టీడీపీది సంక్లిష్టమైన పరిస్థితి. పార్టీకి పూర్వ వైభవం తేవాలంటే చంద్రబాబు శక్తి ఒక్కటే చాలదు. నందమూరి కుటుంబసభ్యులు తలో చేయి వేస్తేనే పార్టీ గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కగలదని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.
TDP Mahanadu 2022
అందుకే వారిని మహానాడుకు పిలవాలని అధినేతకు విన్నవిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబసభ్యులను పట్టించుకోరన్న అపవాదు ఉంది. దీనిని అధిగమించాలంటే కుటుంబసభ్యలందర్నీ ఏకతాటిపైకి తెచ్చి పార్టీలో భాగస్వామ్యం చేయాలని నేతలు, కార్యకర్తలు కోరుతున్నారు. ప్రస్తుతం అన్నగారి కుటుంబంలో బాలక్రిష్ణ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. మిగతా వారు ఉన్నా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కుటుంబాల్లో జరిగే శుభకార్యాల సమయంలో కలుసుకుంటున్నారే తప్ప పార్టీకి సమయం వెచ్చించడం లేదు. కనీసం మహానాడు వేదికపైన వారందర్నీ చూపించగలిగితే పార్టీకి ఇంతో కొంత మైలేజ్ వచ్చే అవకాశముందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే నేతల నుంచి వస్తున్న ఒత్తిడికి చంద్రబాబు సరేనన్నారు. ఇప్పుడు కానీ పట్టు విడుపులకు పోతే పార్టీ పుట్టి మునగడం ఖాయమని తేలడంతో చంద్రబాబు అన్నగారి కుటుంబసభ్యులకు టచ్ లోకి వెళ్లారు.
Also Read: YCP Alliance With Congress: కాంగ్రెస్ వైపు జగన్ చూపు.. వచ్చే ఎన్నికల్లో పొత్తు
TDP Mahanadu 2022
ఆ ఇద్దరిపైనే…
ప్రస్తుతం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్ళు కావడంతో పాటు.. ఎన్టీఆర్ జన్మించి 99 ఏళ్ళు పూర్తి కావొస్తుండడం తో ఆయన శత జయంతి ఉత్సవాలను మహానాడు నుండే మొదలు పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు.. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎన్టీఆర్ కుటుంబసభ్యులందరి సమక్షంలో చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా హరిక్రిష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. వారిని ఎలాగైన మహానాడు వేదికపై తేవాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆ బాధ్యతలను కీలక వ్యక్తులకు అప్పగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
TDP Mahanadu 2022
హరిక్రిష్ణ కుమారుల్లో కల్యణ్ రామ్ చంద్రబాబుతో సత్సంబంధాలే ఉన్నాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా రోజులుగా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో లోకేష్ పెత్తనం సహించలేక సైలెంట్ గా ఉన్నారన్న టాక్ నడుస్తోంది. చంద్రబాబు విషయంలో కాస్త పాజిటివ్ గా కనిపించే జూనియర్ ఎన్టీఆర్.. లోకేష్ విషయానికి వచ్చేసరికి మాత్రం కఠినంగా ఉంటున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఆహ్వానాన్ని జూనియర్ ఎన్టీఆర్ మన్నిస్తారో లేదో చూడాలి. ఇటీవల అసెంబ్లీలో ఎన్టీఆర్ కుమార్తె , చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో ఎన్టీఆర్ కుటుంబం అంతా ఏకతాటిపైకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ నేతల వ్యాఖ్యలను ఖండించింది. ఆ తరహాలోనే ఇప్పుడు టీడీపీ కోసం వారంతా తరలి వస్తారని టీడీపీ అభిమానులు ఆశిస్తున్నారు.కానీ ఒక్క జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యణ్ రామ్ సోదరులు మహానాడు వేదిక నుంచి నందమూరి కుటుంబసభ్యులతో అభివాదం చేస్తే మురిసిపోవాలని సగటు తెలుగుదేశం పార్టీ అభిమాని ఆశిస్తున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి మరీ..
Also Read:KTR Language Style: భాషకు కేసీఆర్ యే కాదు.. కేటీఆర్ కూడా గురువే..?
Recommended Videos:
Web Title: Chandrababu naidu bring the ntr family to mahanadu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com