
ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీలలో ఒకటైన జొమాటో కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కస్టమర్ల కోసం ఏకంగా 3 లక్షల రూపాయల రివార్డ్ ప్రకటించింది. జొమాటో యాప్ లో లేదా కంపెనీ వెబ్ సైట్ లో బగ్ ను కనిపెట్టడం ద్వారా ఈ మొత్తాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బగ్ బౌంటీ ప్రోగ్రామ్ కింద జొమాటో ఏకంగా 3 లక్షల రూపాయలను అందిస్తుండటం గమనార్హం.
హ్యాకర్లకు జొమాటో ఇచ్చిన ఆఫర్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. యాప్ లో బగ్స్ ఏమైనా ఉంటే కనిపెట్టడం ద్వారా ఈ రివార్డును పొందే అవకాశాలు అయితే ఉంటాయి. బగ్ ప్రాతిపదికను బట్టి లభించే రివార్డులో మార్పు ఉంటుంది. కంపెనీ వెబ్‌సైట్, యాప్ సెక్యూరిటీని మరింత పెంచుకోవడం కొరకు జొమాటో ఈ ప్రోగ్రామ్ ను అమలు చేస్తోంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా గుర్తించిన బగ్స్ ను జొమాటో సరి చేసుకోనుంది.
జొమాటో తెచ్చిన ఈ ఆఫర్ వల్ల కస్టమర్లు బగ్ ను కనిపెట్టి సులభంగా డబ్బులు గెలుచుకోవచ్చు. తరచూ జొమాటో ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్లు బగ్స్ ను సులభంగా కనిపెట్టే అవకాశం ఉంటుంది. గతంలో కూడా పలు ప్రముఖ కంపెనీలు బగ్స్ ఏమైనా ఉంటే కనిపెట్టి రివార్డును పొందే అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. కొన్ని కంపెనీలు బగ్స్ ను కనిపెట్టిన వారికి కోట్ల రూపాయల రివార్డులను ఇస్తున్నాయి.
సెక్యూరిటీపరమైన లోపాల వల్ల కొన్నిసార్లు కంపెనీలు భారీ మొత్తంలో నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఆ కారణం వల్లే కంపెనీలు ఇలాంటి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.