https://oktelugu.com/

ప్రజలకు అలర్ట్.. తక్కువ వడ్డీతో గృహ రుణాలిచ్చే బ్యాంకులివే..?

దేశంలోని చాలామంది సొంతింటి కలను నెరవేర్చుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఎక్కువమంది హోమ్ లోన్లపై ఆధారపడుతున్నారు. హోమ్ లోన్స్ విషయంలో కొన్ని బ్యాంకులు ఎక్కువ మొత్తం వడ్డీని వసూలు చేస్తుంటే కొన్ని బ్యాంకులు మాత్రం తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ ను ఇస్తున్నాయి. 30 లక్షల రూపాయల లోపు రుణాలు తీసుకునే వాళ్లకు ప్రముఖ బ్యాంకులు తక్కువ వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంకుల రెపో రేటు తగ్గిన నేపథ్యంలో గృహ వడ్డీ రేట్లు సైతం భారీ మొత్తంలో తగ్గడం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 11, 2021 / 07:53 AM IST
    Follow us on

    దేశంలోని చాలామంది సొంతింటి కలను నెరవేర్చుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఎక్కువమంది హోమ్ లోన్లపై ఆధారపడుతున్నారు. హోమ్ లోన్స్ విషయంలో కొన్ని బ్యాంకులు ఎక్కువ మొత్తం వడ్డీని వసూలు చేస్తుంటే కొన్ని బ్యాంకులు మాత్రం తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ ను ఇస్తున్నాయి. 30 లక్షల రూపాయల లోపు రుణాలు తీసుకునే వాళ్లకు ప్రముఖ బ్యాంకులు తక్కువ వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నాయి.

    బ్యాంకుల రెపో రేటు తగ్గిన నేపథ్యంలో గృహ వడ్డీ రేట్లు సైతం భారీ మొత్తంలో తగ్గడం గమనార్హం. 2019 సంవత్సరం నుంచి ఆర్బీఐ అన్ని బ్యాంకులకు రుణాలను రెపోరేటును అనుసంధానించమని ఆదేశించడం గమనార్హం. 30 లక్షల రూపాయల లోపు గృహ రుణాలకు కోటక్ మహ్రీంద్రా బ్యాంకు 6.65-7.30 శాతం వడ్డీరేటును అమలు చేస్తుండగా పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ 6.65-7.35 శాతం వడ్డీరేటును అందిస్తోంది.

    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.70-7.15 శాతం వడ్డీరేటును అందిస్తుండగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీరేటు 6.75-7.30 శాతంగా ఉంది. హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంక్ గృహ రుణాల విషయంలో 6.75-7.50 శాతం వడ్డీని వసూలు చేస్తుండగా బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేటు 6.75-8.35 శాతంగా ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేటు 6.80-7.35 శాతంగా ఉంది.

    పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.80-7.60, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85-7.30, బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85-8.35, ఐడీబీఐ బ్యాంక్ 6.85-10.05, యూకో బ్యాంక్ 6.90-7.25, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 6.90-8.40, యాక్సిస్ బ్యాంక్ 6.90-8.55, కెనరా బ్యాంక్ 6.90-8.90 వడ్డీ రేట్లను వసూలు చేస్తుండటం గమనార్హం.