Zero Investment Business : చిత్తూరు జిల్లాకు చెందిన రైతు కొడుకు అర్జున్ కశ్యప్ అనే వ్యక్తి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఇచ్చే బియ్యపు పిండి వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. అతను ఎటువంటి పెట్టుబడి లేకుండా ఫ్రాంచైజీలు కావాలని ఆసక్తి ఉన్నవారు నన్ను సంప్రదిస్తే వారికి నేను సహకారం అందిస్తానని అతను తెలిపాడు. గ్రామాలలో చిన్న చిన్న కొట్లు పెట్టుకుని వ్యాపారం చేస్తున్న వారికి ఈ వ్యాపారం చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్న చిన్న గ్రామాలలో రెడీమేడ్ బియ్యపు పిండి దొరకడం చాలా కష్టం. లోకల్ 18 తో మాట్లాడిన అర్జున్ కశ్యప్ అనుకోకుండా బంధువులు ఎవరైనా ఇంటికి వచ్చినా లేదా బ్యాచిలర్స్ అయిన దూరప్రాంతాలకు వెళ్లి పౌష్టికాహారం తినాల్సిన పరిస్థితి ఉన్న సమయంలో ఇది చాలా మంచి ఫుడ్ అని తెలిపాడు. ఎటువంటి వ్యాపారం చేయాలన్న కూడా కొద్దిపాటి పెట్టుబడి అవసరం అవుతుంది. ఈ మధ్యకాలంలో చిన్న టీ కొట్టు పెట్టుకోవాలి అన్నా కూడా లక్షల్లో ఖర్చు అవుతున్న సంగతి తెలిసిందే.
ఎటువంటి వ్యాపారం చేయాలన్నా కూడా లక్షలు ఖర్చు అవుతాయి. కొంతమంది అయితే పెట్టుబడి లేకుండా వ్యాపారం అనే ఆలోచన కూడా చేయరు. మరి కొంతమంది వ్యాపారంలో బాగా రాణించాలి అనే ఉద్దేశంతో అప్పులు చేసి మరి బిజినెస్ మొదలు పెడతారు. వ్యాపారం ప్రారంభించిన తర్వాత అది లాభాలను పొందుతుందో లేదో అని చాలామంది వ్యాపారం చేయడానికి కూడా సాహసించరు. వ్యాపారంలో మనం పెట్టిన పెట్టుబడి వస్తుందో లేదో అని కూడా చాలామంది రకరకాలుగా ఆలోచిస్తారు. అయితే తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన ఒక రైతు కుమారుడు అర్జున్ ఈ వ్యాపారంలో ఎటువంటి రిస్క్ లేదు అలాగే పెట్టుబడి లేదు. మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరం కూడా లేదు అంటూ చెప్పాడు. అర్జున్ చదివిల్లో బాగా రాణించేవాడు.
తాను చదువుకున్న చదువుతో పదిమందికి ఉపాధి కల్పించాలి అనే లక్ష్యంతో అర్జున్ శుభుజ్యం అనే ఒక చిన్న పరిశ్రమను తల్లి అలాగే భార్యను తోడుగా బియ్యపు పిండి వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. బాగా క్వాలిటీ ఉన్న బియ్యపు పిండిని గ్రామాలలో బాగా పాపులర్ చేయాలనే ఉద్దేశంతో ముందుగా గ్రామాలలో శాంపుల్ ప్యాకెట్లు ఇచ్చి బాగా క్వాలిటీ ఉంటేనే కొనండి అంటూ అర్జున్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అలాగే అర్జున్ పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు బల్క్ గా బియ్యపు పిండి కావాలంటే ఎంత కావాలన్నా కూడా రెడీ చేస్తున్నారు. ఈ వ్యాపారానికి మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. మీకు ముందుగా నేను ప్రోడక్ట్ సప్లై చేస్తాను ఇది పది రోజులు పెట్టిన కూడా ఏ మాత్రం మార్పు ఉండదు అంటూ తెలిపాడు. ఈ క్వాలిటీ బియ్యపు పిండితో మీరు ఇడ్లీ, దోష, పునుగులు వంటివి ఏవి చేసుకున్న కూడా చాలా టేస్టీగా ఉంటాయని చెప్తున్నారు. అలాగే ఈ బియ్యపు పిండి చిత్తూరు నుండి కుప్పం వరకు ఉన్న గ్రామాలలో ఎవరికైనా కావాలంటే 9030271027 నెంబర్కు సంప్రదించాలని అర్జున్ కోరుతున్నాడు.