Homeబిజినెస్Zelio E Scooter Price: రూ.54వేలకే 130కిమీ రేంజ్.. మార్కెట్లో దీనికంటే తోపు లేదు

Zelio E Scooter Price: రూ.54వేలకే 130కిమీ రేంజ్.. మార్కెట్లో దీనికంటే తోపు లేదు

Zelio E Scooter Price:  ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీలు ఇప్పుడు ఎలక్ట్రిక్ టూ-వీలర్ల తయారీపై దృష్టి సారిస్తున్నాయి. హై-స్పీడ్ స్కూటర్లతో పాటు లో స్పీడ్ గల మోడళ్లను కూడా విడుదల చేస్తున్నాయి. ఈ కోవలోనే జెలియో ఈ మొబిలిటీ తక్కువ బడ్జెట్ ఉన్న కస్టమర్ల కోసం ఒక కొత్త స్కూటర్‌ను విడుదల చేసింది. దీని పేరు జెలియో గ్రేసీ ప్లస్.

Also Read: మారుతి ఎర్టిగాకు గట్టి పోటీ.. తక్కువ ధరకే లగ్జరీ ఫ్యామిలీ కారు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు బ్యాటరీ ఆప్షన్లలో వస్తుంది. ఇది 185ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో, 150 కిలోల వరకు బరువును మోయగల కెపాసిటీతో రూపొందించబడింది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్, మెరుగైన రైడింగ్ సౌకర్యంతో వస్తున్న ఈ స్కూటర్‌ను ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, డెలివరీ భాగస్వాముల అవసరాలకు తగ్గట్లుగా డిజైన్ చేశారు. ఇది రోజు వారీ ప్రయాణాలు వీలుగా ఉంటుంది.

జెలియో గ్రేసీ ప్లస్ ఒక లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది గంటకు టాప్ స్పీడ్ 25 కి.మీ.. ఇందులో 60/72V BLDC మోటార్ అమర్చారు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 1.8 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుందని కంపెనీ తెలిపింది. లిథియం అయాన్ బ్యాటరీ ఉన్న వేరియంట్‌కు పూర్తి ఛార్జ్ కావడానికి 4 గంటలు పడుతుంది. జెల్ బెస్డ్ బ్యాటరీ ఉన్న వేరియంట్‌కు 8 నుండి 12 గంటల సమయం పడుతుంది.

ఈ స్కూటర్ వివిధ బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. లిథియం అయాన్ బ్యాటరీ వేరియంట్ల విషయానికి వస్తే.. 60V/30AH వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.65,000. ఒకసారి ఛార్జ్ చేస్తే 110 కి.మీ.ల వరకు వెళ్లగలదు. 74V/32AH వేరియంట్ ధర రూ.69,500 (ఎక్స్-షోరూమ్). ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 130 కి.మీ.ల వరకు రేంజ్ ఇస్తుంది.

జెల్ ఆధారిత బ్యాటరీ వేరియంట్లలో బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.54,000. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ.ల వరకు వెళ్లగలదు. హై-ఎండ్ వేరియంట్ ధర రూ.61,000 (ఎక్స్-షోరూమ్). ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 130 కి.మీ.ల వరకు రేంజ్ ఇస్తుంది. ఈ ధరల రేంజ్ లో జెలియో గ్రేసీ ప్లస్‌కు ఓలా జిగ్, కొమాకి ఎక్స్ వన్ ప్రైమ్ వంటి ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ ఉంటుంది.

Also Read: నెక్సాన్, బ్రెజ్జాకు గట్టిపోటీ.. మహీంద్రా XUV3XO AX5 వేరియంట్ పై భారీ తగ్గింపు

జెలియో ఈ మొబిలిటీ తమ స్కూటర్‌పై రెండేళ్ల వారంటీని, లిథియం అయాన్ బ్యాటరీపై మూడేళ్ల వారంటీని, జెల్ ఆధారిత బ్యాటరీ వేరియంట్లపై ఏడాది పాటు వారంటీని అందిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కంపెనీకి 400 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌లు ఉన్నాయి. 2025 చివరి నాటికి వీటి సంఖ్యను 1000 అవుట్‌లెట్‌లకు పెంచాలని కంపెనీ ప్లాన్.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version