Mahindra XUV 3XO AX5: మహీంద్రా పాపులర్ సబ్-4 మీటర్ ఎస్‌యూవీ XUV3XO ధర ఇప్పుడు తగ్గింది. ఈ కారులోని ఒక వేరియంట్ ధర రూ.20,000(ఎక్స్-షోరూమ్) వరకు తగ్గించారు. అయితే ఈ తగ్గింపు XUV3XO కారులోని అన్ని వేరియంట్లకూ వర్తించదు. ఈ ఎస్‌యూవీలో కేవలం AX5 వేరియంట్ ధర మాత్రమే రూ.20,000 తగ్గింది. ఈ వేరియంట్‌లో పెట్రోల్ (మాన్యువల్),పెట్రోల్ (ఆటోమేటిక్) రెండు రకాల మోడళ్ల ధరలూ తగ్గాయి. ఈ తగ్గింపు కారణంగా టాటా నెక్సాన్, మారుతి బ్రెజా వంటి కార్లకు గట్టి షాక్ తగిలినట్లే. రేటు తగ్గించిన తర్వాత ఇప్పుడు AX5 (పెట్రోల్) వేరియంట్‌ను రూ.10.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్) కొనుగోలు చేయవచ్చు. ఇంతకు ముందు దీని ధర రూ.11.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండేది. అలాగే, AX5 పెట్రోల్ (ఆటోమేటిక్) వేరియంట్ ధర కూడా తగ్గింది. గతంలో దీని ధర రూ.12.69 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండగా రూ.20,000 తగ్గింపు తర్వాత ఇప్పుడు దీన్ని రూ.12.49 లక్షలకు (ఎక్స్-షోరూమ్) సొంతం చేసుకోవచ్చు.
ఈ తగ్గింపు జరగడానికి కొద్ది రోజుల ముందు మహీంద్రా XUV3XOలో REVX వేరియంట్‌లను విడుదల చేసింది. ఈ REVX A వేరియంట్ ధర AX5 వేరియంట్ కంటే ఎక్కువ. అయితే, ఇప్పుడు AX5 ధర తగ్గడంతో కొనుగోలుదారులకు ఇది మరింత అందుబాటులోకి వచ్చింది. మహీంద్రా XUV3XO AX5లో 1.2 లీటర్ TCMPFi పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 109bhp పవర్, 200Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది.
Also Read: మారుతి ఎర్టిగాకు గట్టి పోటీ.. తక్కువ ధరకే లగ్జరీ ఫ్యామిలీ కారు
ఫీచర్ల విషయానికి వస్తే AX5 వేరియంట్‌లో అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. వీటిలో డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్, హైట్ అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీటు, ఎలక్ట్రికల్‌గా ఫోల్డ్ చేయగల ORVM, ఒకే టచ్‌తో పైకి లేచే పవర్ విండో వంటివి ఉన్నాయి. ఈ ఫీచర్లన్నీ ఈ ధరలో లభించడం చాలా అరుదు. ఇవి కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. XUV3XO, తన స్టైలిష్ డిజైన్, మంచి ఫీచర్లు, పవర్ ఫుల్ ఇంజిన్‌తో టాటా నెక్సాన్, మారుతి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది. ఇప్పుడు AX5 వేరియంట్ ధర తగ్గడంతో, మరింత ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఫీచర్లు కోరుకునే వారికి, బడ్జెట్ కూడా ముఖ్యమైన వారికి ఈ తగ్గింపు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మహీంద్రా ఈ ధరల తగ్గింపుతో మార్కెట్లో తన వాటాను పెంచుకోవాలని చూస్తోంది.