Renault Triber Facelift: ప్రస్తుతం ఇండియాలో ఎక్కువగా అమ్ముడవుతున్న 7 సీటర్ కార్లలో మారుతి ఎర్టిగా ఒకటి. క్యాబ్ డ్రైవర్ల నుంచి పెద్ద ఫ్యామిలీల వరకు చాలా మంది ఈ కారును ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. మంచి స్పేస్, మంచి మైలేజ్ ఇవ్వడంతో లాంగ్ జర్నీలకు ఈ కారు చాలా బాగుంటుంది. అయితే, ఇప్పుడు ఎర్టిగాకు పోటీగా రెనాల్ట్ ఒక కొత్త కారును తీసుకురాబోతోంది. అదే కొత్త ట్రైబర్. ఈ కొత్త మోడల్ జులై 23న మార్కెట్లోకి వస్తుంది. ట్రైబర్ ప్రస్తుతం భారత మార్కెట్లో ఉన్న 7 సీటర్ కార్లలో కెల్లా చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. రెనాల్ట్ ఇండియా కొత్త ట్రైబర్ మొదటి టీజర్‌ను విడుదల చేసింది. ఈ కారు రేపు, అంటే జులై 23న భారత మార్కెట్లోకి రాబోతోంది. ట్రైబర్ భారత మార్కెట్లో అత్యంత చౌకైన ఎంపీవీ. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వచ్చినా కూడా దీని ధర తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2019లో విడుదలైన తర్వాత ట్రైబర్‌కు ఇది అప్‌డేట్. ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ టీజర్‌తో పాటు, రెనాల్ట్ తన కొత్త లోగోను కూడా విడుదల చేసింది. ఈ కొత్త లోగో ట్రైబర్‌తో పాటు రెనాల్ట్ విడుదల చేయబోయే అన్ని కొత్త కార్లలోనూ ఉపయోగించనున్నారు. ప్రస్తుతం ఉన్న లోగోతో పోలిస్తే కొత్త లోగో మరింత స్టైలిష్‌గా, మోడర్న్‌గా ఉంది. ఇది కొత్త కార్లకు సరికొత్త లుక్‌ను ఇస్తుంది. ప్రస్తుత రెనాల్ట్ ట్రైబర్ ధర రూ.6.15 లక్షల నుండి రూ.8.98 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ధర కొద్దిగా పెరిగే అవకాశం ఉంది.
Also Read: మీ రీల్స్ పిచ్చి పాడుగానూ.. బంగారం లాంటి బెంజ్ కారును ఇలా చేశారు ఏంట్రా
కొత్త ట్రైబర్ ఇంజిన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇందులో ఇప్పటిలాగే 1.0 లీటర్, 3-సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 72 హార్స్‌పవర్ ఎనర్జీ, 96 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయి. అయితే, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇంజిన్ 100 hp పవర్, 160 nm టార్క్‌ను ఇస్తుందని, దీనికి మ్యాన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయని అంటున్నారు. కానీ, దీనిపై కంపెనీ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
కారు లోపలి డిజైన్ దాదాపు అలాగే ఉంటుంది..కానీ కొన్ని చిన్న చిన్న మార్పులు చేయవచ్చు. సీట్ల అప్‌హోల్స్టరీ మారవచ్చు, డాష్‌బోర్డ్ స్టైల్‌లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. కంపెనీ ఇందులో కొన్ని కొత్త ఫీచర్లను కూడా అందించబోతుంది. ఉదాహరణకు, యాంబియెంట్ లైటింగ్, కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్, 360-డిగ్రీ కెమెరా, కూల్డ్ గ్లవ్‌బాక్స్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్. ఈ ఫీచర్లు కారును మరింత ప్రీమియంగా, అట్రాక్టివ్ గా కనిపించేలా చేస్తాయి.
Also Read: పాత కారు అమ్ముతున్నారా? ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే మంచి రేటు వస్తుంది
ఇటీవల లీక్ అయిన స్పై చిత్రాల ప్రకారం, కొత్త ట్రైబర్ బయటి డిజైన్‌లో పెద్ద మార్పులు ఉంటాయి. ఇందులో కొత్త డిజైన్‌తో కూడిన LED DRLs, హెడ్‌లైట్ల ఆకారంలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ముందు బంపర్ పెద్దగా కనిపిస్తుంది. ఇందులో పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌లు, కొత్త ప్రదేశంలో ఫాగ్ ల్యాంప్స్ ఉండవచ్చు. పక్క నుండి చూస్తే కొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్ కనిపిస్తాయి. వెనుక భాగంలో కొత్త బంపర్, కొత్త స్టైల్‌తో కూడిన టెయిల్ ల్యాంప్స్ చూడవచ్చు. ఈ మార్పులన్నీ ట్రైబర్‌కు ఒక కొత్త, అట్రాక్టివ్ లుక్ ఇస్తాయి.