Maruti Suzuki Wagon R : ఈ కాలంలో కారు ప్రతీ ఒక్కరికీ కనీస అవసరంగా మారింది. ఒక చిన్న కుటుంబం అంటే ఎంత మంది ఉంటారు. తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలు. మొత్తం నలుగురు ఎప్పుడు బయటకు వెళ్లాలన్నా బైక్ పై వెళ్లలేం. ఒక వేళ తల్లికి బైక్ నడపడం వస్తే రెండు బైకులు మెయింటైన్ చేయడం కంటే ఒక కారు మెయింటైన్ చేస్తే ఖర్చు తక్కువగా అవుతుంది. కాబట్టి కారు ఎషెన్షియల్ గా మారింది. అయితే మిడిల్ క్లాస్ అంటే కోట్లు, లక్షలు పెట్టి కార్లను కొనలేరు కదా.. రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షలు లోపు మాత్రమే కొంటారు. అలాంటి కార్లు ఏవేవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం. మారుతి సుజుకీ కంపెనీకి చెందిన కార్లు సామాన్యులకు కూడా అందుబాటు ధరల్లో ఉంటాయి. మైలేజీ పరంగా చూసుకున్నా బాగానే ఉంటాయి. ఇండియన్ మార్కెట్ లో ఎక్కువ మంది ఇష్టపడే ఈ కార్లలో చాలా రకాల మోడళ్లు ఉన్నాయి. అందులో ఒకటి ‘వ్యాగన్ ఆర్’. పెట్రోల్ వర్షనే కాకుండా CNG వెర్షన్‌ను కూడా కంపెనీ విక్రయిస్తోంది.
ఈ కారు కొనాలనుకుంటే పూర్తి మొత్తాన్ని చెల్లించే బదులు ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు. దీని కోసం మీరు డౌన్ పేమెంట్, ఈఎంఐ గురించి మొదట అర్థం చేసుకోవాలి. మారుతీ సుజుకి వ్యాగన్ ఆర్ సీఎన్‌జీ బేస్ మోడల్ ఎల్ఎక్స్ఐ దీని ఆన్ రోడ్ ప్రైజ్ ఢిల్లీలో రూ. 6.45 లక్షలు. నగరాలను బట్టి ధర మారవచ్చు. ఇక ఇందులో బేస్ మోడల్‌ను కొనాలనుకుంటే రూ. లక్ష డౌన్ పేమెంట్ చేస్తే చాలు కొత్త కారు మీ చేతికి వస్తుంది.
ప్రతి నెలా EMI ఎంత?
మారుతీ సుజుకీ అందజేసే వ్యాగన్ ఆర్ కారును కొనుగోలు చేసేందుకు మీరు 9.8 శాతం వడ్డీ రేటుతో ఐదేళ్ల పాటు బ్యాంక్ లేదంటే ఫైనాన్స్ కంపెనీ నుంచి రుణం తీసుకోవచ్చు. ఈ కారుపై రూ. 5.45 లక్షల వరకు రుణం మంజూరవుతుంది. ఇప్పుడు బ్యాంక్ లేదంటే ఫైనాన్స్ కంపెనీ నుంచి తీసుకున్న ఈ లోన్‌ని ఈఎంఐ (EMI) రూపంలో చెల్లించాలి. మీరు ఐదేళ్లు వడ్డీతో పాటు మొత్తం రూ. 6.91 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకు ప్రతీ నెలా రూ. 11 వేలు కట్టాలి. మీకు మంజూరయ్యే రుణం, వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది.
మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ పవర్‌ట్రెయిన్
వ్యాగన్ ఆర్ సీఎన్‌జీలో 1.0 లీటర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. ఇది గరిష్టంగా 57 బీహెచ్‌పీ పవర్, 89 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఐదు మ్యానువల్, ఐదు ఆటోమేటెడ్ గేర్ బాక్సుల రూపంలో దొరుకుతుంది. వ్యాగన్ ఆర్ మైలేజ్ విషయానికి వస్తే కేజీ సీఎన్‌జీకి 32.52 నుంచి 34.05 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేస్తుంది. సీఎన్‌జీకి ఎల్‌ఎక్స్‌ఐ (రూ. 6.42 లక్షలు), వీఎక్స్‌ఐ (రూ. 7.23 లక్షలు)లకు దొరుకుతాయి.