Anchor Srimukhi: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో అక్కినేని నాగార్జున హోస్టింగ్ పై ఏ రేంజ్ వ్యతిరేకత వచ్చిందో సోషల్ మీడియా లో మనమంతా చూస్తూనే ఉన్నాం. బహుశా ఈ వైతిరేకతని నాగార్జున గమనించలేదేమో, గమనించి ఉండుంటే ఆయన కచ్చితంగా తన హోస్టింగ్ తీరుని మార్చుకునేవాడు. కంటెస్టెంట్స్ ని సీరియస్ గా నిలదీయాల్సిన వీకెండ్ ఎపిసోడ్స్ ని కామెడీ గా మార్చేయడం, తప్పు చేసిన కంటెస్టెంట్స్ ని కాకుండా కేవలం ఒక్కరినే టార్గెట్ చేసి తిట్టడం వంటివి నాగార్జున పై తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ఒక్కమాటలో చెప్పాలంటే భారీ అంచనాల నడుమ మొదలైన ఈ సీజన్ అంచనాలను అందుకోలేక డీలా పడడానికి కారణం అక్కినేని నాగార్జున హోస్టింగ్ అని విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా లో వ్యక్తం చేస్తూ వచ్చారు. అంతే కాదు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కూడా నాగార్జున హోస్టింగ్ తీరుపై తీవ్రమైన విమర్శలు చేసారు, వారిలో సోనియా , అభయ్ వంటి వారు ఉన్నారు.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ప్రముఖ యాంకర్ శ్రీముఖి కూడా నాగార్జున హోస్టింగ్ పై సెటైర్లు వేయడం సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్, ప్రముఖ నటి తేజస్విని ముడివాడ రీసెంట్ గా ఆహా మీడియా లో ‘కాకమ్మ కబుర్లు’ అనే టాక్ షో కి యాంకర్ గా చేస్తుంది. రీసెంట్ గా ఈ టాక్ షోకి ముఖ్య అతిథులుగా శ్రీముఖి మరియు ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఆర్జే చైతు హాజరయ్యారు. తేజస్విని కాసేపు ఈ ఇద్దరితో సరదాగా చిట్ చాట్ చేస్తూ, శ్రీముఖి ని పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతుంది. అందులో ఒక ప్రశ్న ఆమె అడుగుతూ ‘ఇప్పుడు నడుస్తున్న షోస్ లో, ఏ షో కి నీకు వాళ్ళకంటే నేను బెటర్ గా హోస్టింగ్ చేయగలనని అనిపించింది?’ అని అడుగుతుంది.
దానికి శ్రీముఖి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా బిగ్ బాస్ అని సమాధానం ఇస్తుంది. అంటే నాగార్జున కంటే ఈమె బెటర్ గా హోస్టింగ్ చేస్తుందని ఆమె మాటల్లోని ఆంతర్యంని అర్థం చేసుకోవచ్చు. శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 లో ఒక కంటెస్టెంట్ గా లోపలకు అడుగుపెట్టి, తన అద్భుతమైన ఆటతీరుతో రన్నర్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆమె సీజన్ 7 లో ఒక అతిథి గా లోపలకు అడుగుపెడుతుంది. అదే విధంగా సీజన్ 8 లో కూడా ఆమె అడుగుపెట్టి ‘టికెట్ టు ఫినాలే’ టాస్కులు నిర్వహించి, అవినాష్ చేతిలో టికెట్ పెట్టి వెళ్తుంది. ఇలా బిగ్ బాస్ టీం ఆమెతో నిత్యం ఎదో ఒక ప్రక్రియ ప్రతీ సీజన్ లోనూ చేయిస్తూ ఉంటారు. అలాంటి ఆమెనే బిగ్ బాస్ హోస్ట్ గురించి ఇలా మాట్లాడిందంటే ఇక నాగార్జున హోస్టింగ్ ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు.