Pawan Kalyan: ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు అయ్యినందుకు వాళ్ళు పొందిన గొప్ప అనుభూతి ఏ హీరో అభిమాని కూడా పొంది ఉండదు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య జనసేన పార్టీ ని స్థాపించి, పదేళ్లు పవర్ లేకపోయినా, కేవలం తన క్రేజ్ తో, చరిష్మా తో నెట్టుకొచ్చాడు పవన్ కళ్యాణ్. 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆయన కష్టపడి కట్టిన కూటమి, రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాలను కూడా మార్చేసింది. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం, కేంద్రం లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ కట్టిన కూటమే. అంతే కాకుండా పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొందిన ఏకైక భారతీయ ప్రాంతీయ పార్టీ గా జనసేన పార్టీ నిల్చింది.
ఇక గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్న ఆయన పనితీరు వేరే లెవెల్ లో ఉంది. కేవలం ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే కాకుండా ఢిల్లీ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచాడు. అందుకే పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చర్చించుకోబడ్డ సెలబ్రిటీ గా గూగుల్ వరల్డ్ వైడ్ ట్రెండ్స్ లో రెండవ స్థానం లో నిలిచాడు. ఒక్కసారి టాప్ 5 లిస్ట్ ని పరిశీలిస్తే మొదటి స్థానంలో కేట్ విల్లియమ్స్ నిలబడగా, రెండవ స్థానంలో పవన్ కళ్యాణ్, మూడవ స్థానం లో ఆడాం బ్రాడీ, నాల్గవ స్థానంలో ఎల్లా పుర్ణిల్, ఐదవ స్థానంలో హీనా ఖాన్ నిలిచారు. ఇంత మంది హాలీవుడ్ నటీనటుల మధ్య మన తెలుగోడు కనిపిస్తుంటే ఎంతో అందంగా ఉంది కదూ. ఇప్పటి వరకు తెలుగు వాళ్ళు కాదు కదా, కనీసం ఒక్క ఇండియన్ సెలబ్రిటీ కూడా ఇలా గూగుల్ వరల్డ్ వైడ్ ట్రెండ్స్ లో కొనసాగలేదు.
ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఆ ఘనత దక్కింది. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ సాధించిన విజయం ప్రపంచవ్యాప్తంగా ఎలా రీసౌండ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం పార్లమెంట్ హాల్ లో అంత మంది ఎంపీలు, ముఖ్యమంత్రుల సమక్ష్యంలో ఇతను పవన్ కాదు, తుఫాన్ అని పిలవడం దగ్గర నుండి, మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ గెలుపుకి కీలక కారణం అవ్వడం, కాకినాడ పోర్ట్ లో సముద్రంలోకి వెళ్లి షిప్ ని సీజ్ చేయడం వంటి అంశాలు సెన్సేషనల్ టాపిక్స్ గా నిలిచాయి. అందుకే పవన్ కళ్యాణ్ వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయ్యాడని అంటున్నారు విశ్లేషకులు. మరి రాబోయే రోజుల్లో ఒక పక్క రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉంటూనే, మరో పక్క ఆయన నటించిన పాన్ ఇండియన్ సినిమాలు కూడా విడుదల అవ్వబోతున్నాయి. వీటితో ఆయన పేరు ఇంకెంత మారుమోగిపోబోతుందో చూడాలి.