Tirupati : ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరో అపచారం చోటుచేసుకుంది. ఇప్పటికే టీటీడీ విషయంలో అనేక వివాదాస్పద అంశాలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డు కల్తీ అంశం ప్రపంచాన్ని కుదిపేసింది. లక్షలాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. అయితే ప్రధానంగా తిరుమల లో అన్యమతస్తుల ప్రభావం, మతమార్పిడులు, అంతకుమించి ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో తాజాగా మరో ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కొందరు ఆగంతకులు తిరుపతిలో ఏకంగా అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టారు. దీంతో హిందూ భక్తులు భగ్గుమంటున్నారు. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టిన ఘటనపై తిరుపతిలోని హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. విషయం తెలియగానే భజరంగ్ దల్ తో పాటు ఇతర హిందూ సంఘాల నాయకులు అక్కడకు చేరుకొని నిరసన తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించారు.
* లడ్డుపై సిట్ విచారణ కొనసాగుతుండగా..
మరో 24 గంటల వ్యవధిలో క్రిస్మస్ వేడుకలు జరగనున్నాయి. ఇటువంటి తరుణంలోనే అన్నమయ్య విగ్రహంపై శాంతా క్లాజ్ టోపీ పెట్టడం పై రకరకాల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకే ఈ ఘటనకు పాల్పడినట్లు అర్థమవుతోంది.ఇప్పటికే టీటీడీ లడ్డు వివాదం పెను ప్రకంపనలకు దారితీసింది. అత్యంత వివాదాస్పదంగా మారింది.దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ కొనసాగుతోంది.అలా ఉండగానే ఇప్పుడు అదే తిరుపతిలో ఏకంగా అన్నమయ్య విగ్రహంపై కుట్ర జరగడం సంచలనం గా మారింది.
* నేడు టిటిడి సర్వసభ్య సమావేశం
తిరుమల తిరుపతి దేవస్థానం తో పాటు తిరుపతిలో చాపకింద నీరులా అన్యమత ప్రచారం జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. దీనిపై పటిష్ట చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ముఖ్యంగా టీటీడీలో పనిచేస్తున్న చాలామందిలో అన్య మతస్తులు ఉన్నారు. వారే వివాదానికి కారణం అవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వారి సేవలను టీటీడీలో కాకుండా ప్రత్యేకంగా వాడుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. సరిగ్గా తిరుమలలో ఈ ఘటన జరగడం.. ఇదే రోజు టీటీడీ సర్వసభ్య సమావేశం జరుగుతుండడంతో అందరి దృష్టి దానిపై పడింది. ముఖ్యంగా టీటీడీలో పనిచేస్తున్న అన్య మతస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.
తిరుపతి జిల్లా…..
తిరుపతిలో అపచారం
క్రిస్మస్ పండుగ ముందు రోజు తిరుపతిలో దుండగుల దుశ్చర్య….
తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి శాంటక్లాస్ టోపీని పెట్టిన దుండగులు…
అన్నమయ్యను అవమానమీయంగా శాంట క్లాస్ టోపీ పెట్టడాన్ని తీవ్రంగా… pic.twitter.com/tmxQM2Z5BC
— Aadhan Telugu (@AadhanTelugu) December 24, 2024