Ravi Teja: మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) కెరీర్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎలా మొదలైందో, ఆయన కొడుకు మహాధన్ కెరీర్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గానే మొదలైంది. ఇండియా లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన సందీప్ రెడ్డి వంగ వద్ద ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. కేవలం మహాధన్ మాత్రమే కాదు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కొడుకు రిషి కూడా సందీప్ వంగ వద్ద ప్రస్తుతం పని చేస్తున్నాడు. ప్రస్తుతం వీళ్లంతా ‘ప్రభాస్’ స్పిరిట్ మూవీ కోసం పని చేస్తున్నారు. బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ లాగా పెరిగిన రవితేజ కొడుకు, కోరుకుంటే హీరో గానే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. పెద్ద స్టార్ డైరెక్టర్స్ కూడా ఆయన మొదటి సినిమా కి దర్శకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కానీ మహాధన్ కి భవిష్యత్తులో హీరో అవ్వాలని ఉందో లేదో తెలియదు కానీ, డైరెక్టర్ అవ్వాలని మాత్రం చాలా గట్టిగా ఉంది అనేది స్పష్టంగా తెలుస్తోంది.
2017 వ సంవత్సరం లో రవితేజ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో రవితేజ తనయుడు మహాధన్ చిన్నప్పటి రవితేజ క్యారక్టర్ లో ఎంత చక్కగా నటించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎంతో సహజం గా, రవితేజ కంటే బాగా చేసాడు అని ఆడియన్స్ చేత అనిపించుకున్నాడు. కుర్రాడిలో మంచి టాలెంట్ ఉంది, పైకి వస్తాడని అంతా అనుకున్నారు. కానీ అతని ఆసక్తి దర్శకత్వం మీద ఉందని సందీప్ వంగ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరినప్పుడే తెలిసింది. ఇదంతా పక్కన పెడితే రవితేజ హీరో గా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు ప్రొమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఈ ఇంటర్వ్యూ లో ఇద్దరు హీరోయిన్స్ తో కలిసి కూర్చున్న రవితేజ ని, యాంకర్ సుమ తన ట్యాబ్ లోని ఫోటోని చూపిస్తూ ‘ఇందులో ఉన్నది మీ అబ్బాయి మహాధన్ కదా?, సందీప్ వంగ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడా?’ అని రవితేజ ని అడిగినప్పుడు, ‘అవును..పని చేస్తున్నాడు. ఇతనితో పాటు మన త్రివిక్రమ్ శ్రీనివాస్ కొడుకు కూడా ఆ టీం లో పని చేస్తున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ‘మరి మీ అబ్బాయిని మీ సినిమాకు పని చేయొద్దని చెప్పారా?’ అని యాంకర్ సుమ అడగ్గా, అందుకు రవితేజ సమాధానం చెప్తూ ‘నేను వాడికి ఎప్పుడూ కూడా ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పలేదు, భవిష్యత్తులో కూడా చెప్పను, అంతా వాడిష్టమే’ అంటూ చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినా ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.