కొత్త సంవత్సరం షియోమీ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. ఫోన్ల ధరలలో ఎటువంటి మార్పులు చేయకపోయినా టీవీల ధరలను మాత్రం భారీగా పెంచేసింది. షియోమీ టీవీల ధరలు 1,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు పెరగడం గమనార్హం. ఎంఐ.కామ్ వెబ్ సైట్ లో ప్రస్తుతం పెరిగిన ధరలకే టీవీలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎంఐ టీవీ హారిజన్ ఎడిషన్, ఎంఐ టీవీ 4ఎక్స్, ఎంఐ టీవీ 4ఏ ధరలను షియోమీ పెంచినట్లు సమాచారం.
Also Read: బంగారం కొనుగోలు చేసేవాళ్లకు గుడ్ న్యూస్.. ఆ డాక్యుమెంట్లు అక్కర్లేదట..?
గత నెలలో షియోమీ టీవీ ధరలను పెంచే అవకాశం ఉందంటూ కీలక ప్రకటన చేసింది. గత నెలలో టీవీ విడిభాగాల ధరలు భారీగా పెరగడంతో టీవీ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని షియోమీ పేర్కొంది. షియోమీ చేసిన ప్రకటనకు అనుగుణంగానే టీవీ ధరలు భారీగా పెరగడం గమనార్హం. ఆఫ్ లైన్ రిటైల్ దుకాణాల్లో సైతం పెరిగిన ధరలకే టీవీల విక్రయాలు జరగనున్నాయని తెలుస్తోంది.
Also Read: ఎస్బీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఈ డెబిట్ కార్డ్ తో భారీ లాభాలు..?
దేశంలో షియోమీ టీవీలకు డిమాండ్ భారీగా ఉంది. ఏడాదికి 25 లక్షల చొప్పున గత రెండేళ్లలో 50 లక్షల టీవీలు అమ్ముడయ్యాయి. అత్యాధునిక ఫీచర్లతో షియోమీ కొత్తరకం టీవీ మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తూ కస్టమర్లకు మరింత చేరువవుతోంది. ప్రస్తుతం ఇతర కంపెనీలతో పోల్చి చూస్తే షియోమీ టీవీలు మార్కెట్ లో తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. అయితే ధరలు పెరగడం కొనుగోళ్లపై ప్రభావం చూపుతుందేమో చూడాల్సి ఉంది.
మరిన్ని వార్తల కోసం: వ్యాపారము
షియోమీ కంపెనీ గత నెలలో ఎంఐ క్యూఎల్ఈడీ టీవీని కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ టీవీలో డాల్బీ విజన్ ఫీచర్ కూడా ఉండటం గమనార్హం. ఎంఐ టీవీ 4ఏ, ఎంఐ టీవీ 4ఏ హారిజన్ ఎడిషన్ 32 అంగుళాల మోడల్ 1,000 రూపాయలు పెరగగా 43 అంగుళాల వేరియంట్ ధర 2,000 పెరిగింది. మిగిలిన మోడళ్లు 3,000 రూపాయల వరకు పెరిగాయి.