కేటీఆర్‌‌కు నిరసన సెగ..: గో బ్యాక్‌ అంటూ నినాదాలు

తెలంగాణ ఐటీ, మున్సిపల్ మినిస్టర్‌‌ కేటీఆర్‌కు నిరసన సెగ తగిలింది. శనివారంహైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొత్తగా గెలిచిన కార్పొరేటర్‌ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించకుండా ప్రొటోకాల్ విస్మరించారని కేటీఆర్‌పై స్థానిక బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ డౌన్ డౌన్.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. Also Read: ఆలయాలపై దాడులు..: తెలంగాణ పోలీసులు ఎంక్వైరీ చేయాలంట బాగ్‌లింగంపల్లి […]

Written By: Srinivas, Updated On : January 9, 2021 2:47 pm
Follow us on


తెలంగాణ ఐటీ, మున్సిపల్ మినిస్టర్‌‌ కేటీఆర్‌కు నిరసన సెగ తగిలింది. శనివారంహైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొత్తగా గెలిచిన కార్పొరేటర్‌ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించకుండా ప్రొటోకాల్ విస్మరించారని కేటీఆర్‌పై స్థానిక బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ డౌన్ డౌన్.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

Also Read: ఆలయాలపై దాడులు..: తెలంగాణ పోలీసులు ఎంక్వైరీ చేయాలంట

బాగ్‌లింగంపల్లి పరిధిలోని లంబాడితండాలో మంత్రి కేటీఆర్ శనివారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు. 120 మంది లబ్ధిదారులకు కొత్త ఇళ్లను అందించారు. అయితే.. కొత్తగా గెలిచిన బాగ్‌లింగంపల్లి కార్పొరేటర్‌ను ఈ కార్యక్రమానికి ఎందుకు ఆహ్వానించలేదని బీజేపీ నేతలు నిరసనకు దిగారు. దీంతో మంత్రి కేటీఆర్, మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పాత పాలకమండలి గడువు ఇంకా తీరనందునా పాత కార్పొరేటర్‌నే ఆహ్వానించినట్లు మంత్రులు చెప్పారు. అయినప్పటికీ బీజేపీ నేతలు శాంతించలేదు.

బీజేపీ కార్యకర్తలు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, వారికి మధ్య స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఆ సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. మంత్రి కేటీఆర్‌తో కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో కొత్త పాలకమండలిని ఏర్పాటు చేయాలని… కార్పొరేటర్లుగా గెలిచి నెల రోజులవుతున్నా తమకు ప్రొటోకాల్ ఇవ్వకపోవడమేంటని కొద్దిరోజులుగా బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల ప్రగతి భవన్‌ను సైతం ముట్టడించారు.

Also Read: దెబ్బకు ఆ ఎస్పీ సెలవు పెట్టి వెళ్లాడు..!

ఈ వివాదంపై స్పందించిన కేటీఆర్‌‌ మాట్లాడుతూ.. ‘ఎన్నికల సమయంలో ఎవరి వాదన వారు చెప్పాం. ఎన్నికలు ముగిశాక ప్రజా సంక్షేమం, అభివృద్ధి తప్ప మరో పంచాయితీ అవసరం లేదు. కలిసిమెలిసి సమన్వయంతో పనిచేద్దాం. రాజకీయాల్లో పోటీతత్వం ఉండాలి కానీ అనవసర లొల్లులు వద్దు. ప్రజలు ఇలాంటి వైఖరిని హర్షించరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు సాగితేనే ప్రజలు హర్షిస్తారు’ అని పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్