Xiaomi 17, 17 ultra: స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోతున్న క్రమంలో.. చాలామంది కొత్త కొత్త ఫీచర్లను కోరుకుంటున్నారు. కంపెనీలు కూడా మార్కెట్లో స్ట్రాంగ్ బేస్ పెంచుకోవడానికి రకరకాల సదుపాయాలను అందుబాటులో తీసుకొస్తున్నాయి. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ మార్కెట్ అయిన ఇండియాలో చైనా కంపెనీలు కంప్లీట్ డామినేషన్ చేస్తున్నాయి.
చైనా కంపెనీలలో xiaomi కి ఇండియన్ మార్కెట్లో బలమైన వాటా ఉంది. ఈ కంపెనీ అనేక మోడల్స్ ను తయారుచేసింది.. వాటిల్లో xiaomi 17, 17 ultra ఈ ఏడాది మార్చి 11న మార్కెట్లోకి విడుదలయ్యాయి.. ఈ రెండు మోడల్స్ కూడా స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్లాట్ ఫామ్ ను కలిగి ఉన్నాయి. రెండు ఫోన్లు కూడా LTPO AMOLED డిస్ ప్లే తో లభిస్తాయి. 3500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ను ప్రదర్శిస్తాయి. 200 megapixel సామర్థ్యం ఉన్న కెమెరాలో టెలిఫోటో సెన్సార్లు ఉన్నాయి. ఇందులో అత్యంత ఆధునికమైన లైకా ట్యూన్ కెమెరా వ్యవస్థలు కూడా ఉన్నాయి.
ఈ మోడల్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బ్యాటరీ ఆప్టిమైజేషన్ చేయవచ్చు. Xiaomi 17 మోడల్ లో 6.3 అంగుళాల ltpo AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది ఒకటి నుంచి 120 హెచ్ జెడ్ వరకు అడాప్టివ్ రీ ఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తుంది. 3,500 నిట్ వరకు బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 12 బిట్ కలర్ డెప్త్.. హెచ్ డి ఆర్ 10 ప్లస్, డాల్బీ విజన్ ను సపోర్ట్ చేస్తుంది.. xiaomi షీల్డ్ గ్లాస్ 3.0 తో లభిస్తుంది.. దుమ్ము, దూళి, నీటి నిరోధకత కోసం ఐపి68/69 వ్యవస్థను xiaomi ఏర్పాటు చేసింది.
అంతర్గతంగా xiaomi 17 Qualcomm Snapdragon 8 Elite Gen 5 మొబైల్ ప్లాట్ఫారం ను సపోర్ట్ చేస్తుంది. ఇది 12gb LP DDR 5x Ram, UFS 4.1 storage ఆప్షన్ కలిగి ఉంటుంది. ఈ మోడల్స్ లో 256 జిబి, 52 జిబి ఇంటర్నల్ మెమొరీ ఉంటుంది. ఈ మోడల్ లో 6,330 ఎం ఏ హెచ్ సిలికాన్ కార్బన్ సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉంది. అలాగే 100 డబ్ల్యు వైర్డ్ చార్జింగ్, 50w వైర్లెస్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ వెనక భాగంలో త్రిబుల్ కెమెరా వ్యవస్థ ఉంది. ఇందులో లైట్ ఫ్యూజన్ 950 సెన్సార్ తో 50 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా.. 60 ఎంఎం ఫోకల్ లెంగ్త్ తో 50 మెగా ఫిక్సల్ టెలిఫోటో కెమెరా, 50 మెగాపిక్సల్ ఆల్ట్రా వైడ్ కెమెరా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియోల కోసం xiaomi 17 50 megapixel ఫ్రంట్ షూటర్ ను కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారంగా హైపర్ ఓఎస్ 3 ని సపోర్ట్ చేస్తుంది..
ధరల విషయానికొస్తే రెగ్యులర్ xiaomi 17 మోడల్ లో 12 GB RAM, 256 GB internal memory సదుపాయాలు ఉన్నాయి. దీని ధర 89,999. హయ్యండ్ 12gb, 512 జిబి వేరియంట్ ధర 99,999 గా ఉంది. ఈ మోడల్ నీలం, నలుపు, ఆకుపచ్చ, బహుళ రంగులలో లభ్యమవుతోంది.. xiaomi 17 ultra ధర 1,39,999 లో లభిస్తుంది. ఫోటోగ్రఫీ కిట్ ప్రో ధర 19,999 లో లభిస్తుండగా.. 17 అల్ట్రా మోడల్ కొనుగోలు చేసిన వారికి ఎర్లీ బర్డ్ ఆఫర్లో భాగంగా ఫోటో గ్రఫి కిట్ ఉచితంగా లభిస్తుంది. ఈ ఫోన్లు అమెజాన్, xiaomi outlet లలో మార్చి 18 నుంచి అందుబాటులో ఉంటాయి.