
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ ద్వారా ప్రతి సంవత్సరం రూ.36 వేలు అందిస్తోంది. ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వారు ఈ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు 21 లక్షల మంది ఈ స్కీమ్ లో చేరగా ప్రస్తుతం వీరందరికీ సంవత్సరానికి 36 వేల రూపాయలు లభిస్తున్నాయి. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లలో 7 లక్షల మంది మహిళలు ఉన్నారు.
కేంద్రం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఇతర పెన్షన్ స్కీమ్ లలా ఈ స్కీమ్ కూడా పెన్షన్ స్కీమ్ అని చెప్పవచ్చు. మహిళలు ఈ స్కీమ్ లో చేరితే 60 సంవత్సరాల వయస్సు తర్వాత మాత్రమే రూ.3 వేల పెన్షన్ లభిస్తుంది. అయితే ఈ స్కీమ్ లో అందరూ చేరడం సాధ్యం కాదు. కేవలం మహిళా రైతులు మాత్రమే ఈ స్కీమ్ లో సులువుగా చేరడం సాధ్యమవుతుంది.
ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వాళ్లు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు చెల్లించాల్సి ఉంటుంది. వయస్సు ప్రాతిపదికన చెల్లించే మొత్తంలో మార్పులు ఉంటాయి. ఎవరైనా డబ్బు అవసరమైతే మధ్యలోనే స్కీమ్ నుంచి తప్పుకొని డబ్బులు వెనక్కు తీసుకునే అవకాశం ఉంటుంది. స్కీమ్‌లో చేరిన వారు మరణిస్తే భాగస్వామి సగం డబ్బులు పొందే అవకాశం ఉంటుంది.
కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఈ స్కీమ్ లో సులభంగా చేరే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో ఎవరైతే చేరాలని అనుకుంటారో వారికి రెండు ఫోటోలు, బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. పీఎం కిసాన్ స్కీమ్ లో చేరి ఆ స్కీమ్ ద్వారా డబ్బులు పొందుతున్న వాళ్లు మాన్ ధన్ స్కీమ్ లో పీఎం కిసాన్ డబ్బులను ఇన్వెస్ట్ చేసి పెన్షన్ ను పొందవచ్చు.