
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెన్షన్ పొందాలని అనుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలని అనుకునే వాళ్ల కోసం ఎల్‌ఐసీ జీవన్ అక్షయ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎవరైతే ఈ పాలసీని తీసుకుంటారో వారు ప్రతి నెలా రూ.4 వేలు పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. ఈ పాలసీలో ఒక్కసారి డబ్బులు చెల్లిస్తే నెలనెలా డబ్బులు పొందే అవకాశం ఉంటుంది.
కనీసం రూ.లక్ష నుంచి ఈ పాలసీలో డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. గరిష్ట పరిమితి లేకపోవడంతో ఈ పాలసీలో ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎవరైతే ఈ పాలసీని తీసుకోవాలని అనుకుంటారో వారు ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో ఈ పాలసీని తీసుకునే అవకాశం ఉంటుంది. జీవన్ అక్షయ పాలసీలో చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ లైఫ్ టైమ్ ఇమ్మీడియట్ పెన్షన్ ఆప్షన్ ద్వారా వెంటనే పెన్షన్ తీసుకోవచ్చు.
30 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పెన్షన్ స్కీమ్ లో చేరవచ్చు. ఎవరైతే ఈ పాలసీని తీసుకుంటారో వారు పాలసీపై లోన్ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ పాలసీలో రూ.8 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా రూ.4 వేలు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. రూ.2 లక్షలు డిపాజిట్ చేసిన వాళ్లు 1000 రూపాయలు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.
ఈ పాలసీ ద్వారా జీవించి ఉన్నంత కాలం ప్రతి నెలా పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. సమీపంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.