https://oktelugu.com/

Wipro: ఐటీ ఉద్యోగులకు విప్రో గుడ్ న్యూస్.. అతిపెద్ద భారీ కాంట్రాక్ట్..

ఐటీ కంపెనీలు ఇంత సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే విప్రో మాత్రం తమ సంస్థ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేల కోట్ల విలువైన భారీ ప్రాజెక్ట్ ను దక్కించుకున్నట్లు ఉద్యోగులకు మంచి వార్త చెప్పింది. ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయో తెలియని ఆందోళనలో ఉన్న సమయంలో ఈ న్యూస్ నోట్లో చెక్కర పోసినంత తీయగా అనిపించింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : June 7, 2024 / 01:32 PM IST

    Wipro

    Follow us on

    Wipro: వరల్డ్ ఐటీ సెక్టార్ ఆర్థిక అనిశ్చితి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో చాలా కంపెనీలు లే ఆఫ్స్ కూడా ప్రకటించాయి. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ కూడా దీనికి అతీతం కాదు అన్నట్లుగా మారింది. ప్రతీ ఏటా వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. దీంతో వారు రోడ్డున పడి ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఉద్యోగంలో ఉన్న వారు కూడా ఎంత మాత్రం ఆనందంగా లేరు. ఎందుకంటే వారి ఉద్యోగాలు కూడా ఎప్పుడు పోతాయా? అటూ భయపడుతూనే ఉద్యోగం చేస్తున్నారు.

    ఐటీ కంపెనీలు ఇంత సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే విప్రో మాత్రం తమ సంస్థ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేల కోట్ల విలువైన భారీ ప్రాజెక్ట్ ను దక్కించుకున్నట్లు ఉద్యోగులకు మంచి వార్త చెప్పింది. ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయో తెలియని ఆందోళనలో ఉన్న సమయంలో ఈ న్యూస్ నోట్లో చెక్కర పోసినంత తీయగా అనిపించింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సెక్టార్ కుదేలవుతుంటే.. ఇండియన్ ఐటీ కంపెనీ అయిన విప్రో మాత్రం భారీ కాంట్రాక్టులను దక్కించుకొంటూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రముఖ అమెరికా కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి భారీ కాంట్రాక్ట్ పొందినట్లు కంపెనీ తెలిపింది. ఐదేళ్ల కాలానికి సుమారు 4,175 కోట్ల రూపాయల డీల్ ను దక్కించుకున్నట్లు కంపెనీ ఎక్స్ ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్ లో తెలిపింది.

    ఈ డీల్ లో భాగంగా కంపెనీ ఉత్పత్తులు, పరిశ్రమకు సంబంధించిన పరిష్కారాల కోసం అమెరికన్ సంస్థకు నిర్వహణ సేవలను అందించనున్నట్లు విప్రో తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో విప్రో కమ్యూనికేషన్ విభాగం వార్షిక ప్రాతిపదికన 14.7 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయంలో విప్రో కమ్యూనికేషన్ విభాగం నుంచి కంపెనీకి 4.2 శాతం ఆదాయం సమకూరింది.

    అగ్రశ్రేణి ఐటీ సంస్థలకు 500 మిలియన్ డాలర్ల నుంచి బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కీలకం. ఎందుకంటే ఈ ఒప్పందాలే ఆదాయ వృద్ధిని ప్రభావితం చేస్తాయి. నాలుగో త్రైమాసికంలో విప్రో డీల్ బుకింగ్స్ 9.5 శాతం పెరిగి 1.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని.. వృద్ధిని వేగవంతం చేయడమే తక్షణ కర్తవ్యం అని కొత్త సీఈఓ శ్రీనివాస్ పలియా ఎర్నింగ్స్ కాల్ లో పేర్కొన్నారు. ఐటీ పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా లబోదిబోమంటుంటే.. ఇండియన్ ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో మాత్రం భారీ కాంట్రాక్ట్ ను దక్కించుకొని ఫుల్ జోష్ లో ఉంది.