https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ విజయం.. పట్టరాని ఆనందంలో ఆ మహిళ.. సొంత డబ్బులతో ఊరంతా విందు

ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రం మొత్తం చుట్టివచ్చారు. ఆయన ప్రసంగాలకు యువత ఫిదా అయ్యారు. జగన్ పై చేసిన విమర్శలు.. ప్రభుత్వ తప్పిదాలను ఆయన వివరించిన విధానం ఓటర్లను ఆకట్టుకుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 7, 2024 / 01:37 PM IST

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan: హోరాహోరీగా సాగుతుందనుకున్న ఏపీ ఎన్నికలు వన్ సైడ్ మ్యాచ్ గా మారిపోయాయి. కూటమిగా ఏర్పడిన టిడిపి, బిజెపి, జనసేన అధికార వైసిపిని నేల నాకించాయి. గత ఎన్నికల్లో 151 సీట్లతో అదరగొట్టిన వైసిపిని.. ఈసారి 11 సీట్లకే పరిమితం చేశాయి. దీంతో ఏపీవ్యాప్తంగా కూటమి కార్యకర్తల్లో సంబరాలు మిన్నంటుతున్నాయి. ఇక ఈ కూటమిలో హైయెస్ట్ విన్నింగ్ పర్సంటేజ్ ఏ పార్టీది అంటే.. అది ముమ్మాటికి జనసేనదే. పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాలలో జనసేన విజయం సాధించింది. గత ఎన్నికల్లో ఒక స్థానానికి పరిమితమైన ఆ పార్టీ.. ఈసారి ఏకంగా 20 స్థానాల్లో తన ఖాతాలో వేసుకుంది.

    ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రం మొత్తం చుట్టివచ్చారు. ఆయన ప్రసంగాలకు యువత ఫిదా అయ్యారు. జగన్ పై చేసిన విమర్శలు.. ప్రభుత్వ తప్పిదాలను ఆయన వివరించిన విధానం ఓటర్లను ఆకట్టుకుంది. అందుకే ఆ పార్టీ పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాలను గెలిపించి ఏపీ ఓటర్లు బలంగా ఆశీర్వదించారు.. పవన్ కళ్యాణ్ పోరాట స్ఫూర్తిని మెచ్చుకుంటూ ఓ మహిళ అప్పట్లో సంచలన ప్రకటన చేసింది. వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆమె అలా ప్రకటన చేయడం కలకలం రేపింది. అయితే ఇప్పుడు ఆ మహిళ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

    పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే తన భర్త రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో ఊరంతా విందు ఇస్తానని అప్పట్లో ఓ మహిళ చెప్పింది. ఈ విషయం జనసేనాని పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళింది. ఆమె చెప్పిన విషయాన్ని పవన్ కళ్యాణ్ పదేపదే పలు సమావేశాలలో ప్రస్తావించారు.. ఆ మహిళ చేసిన శపథం తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు. అది ఓటర్లకు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా పిఠాపురం లో ఆ మహిళ చేసిన ప్రకటన వైరల్ గా మారింది. ఇది ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేయడంతో జనసేన తన పోటీ చేసిన 21కి 21 సీట్లు గెలుచుకుంది. దీంతో ఆ మహిళలో పట్టరాని ఆనందం నెలకొంది.. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు ఆ మహిళ సందడి చేసింది. ఊరంతా మిఠాయిలు పంచింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విజయాన్ని ఎక్కువగా ఆస్వాదించే మహిళ ఈవిడేనని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఆమెను కలవాలని సూచిస్తున్నారు. ఆ వృద్ధురాలి కళ్ళల్లో ఆనందం చూడాలని కామెంట్స్ చేస్తున్నారు..