Windsor EV Pro vs Windsor EV : ఎంజీ కంపెనీ 449 కిలోమీటర్ల రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేసింది. ఎంజీ విండ్‌సర్ ప్రోను కంపెనీ ప్రారంభ ధర రూ.17.50 లక్షలకు లాంచ్ చేసింది. అయితే, దీని బ్యాటరీని అద్దెకు తీసుకుంటే (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్), దీని ధర రూ.12.50 లక్షలు అవుతుంది. తక్కువ ధరలో 332 కిలోమీటర్ల సింగిల్ ఛార్జ్ రేంజ్‌ను అందించే ఎంజీ విండ్‌సర్‌తో పోలిస్తే ఈ కారును కొనడం ఎంతవరకు లాభదాయకమో తెలుసుకుందాం.
విండ్‌సర్ ఈవీ ప్రో, విండ్‌సర్ ఈవీలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో అర్థం చేసుకునేందుకు రెండు కార్ల మధ్య వ్యత్యాసాని్న వివిధ అంశాల పరంగా పరిశీలిద్దాం. ఇందులో కారు ధర, వాటి రేంజ్, బ్యాటరీ అద్దె ధరలో తేడా మొదలైనవి ఉంటాయి. విండ్‌సర్ ఈవీ ప్రోలో కంపెనీ 52.9కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్‌ను అందించింది. అయితే విండ్‌సర్ ఈవీలో 38కిలో వాట్స్ బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. కాబట్టి ఈ రెండు కార్ల రేంజ్‌లో దాదాపు 100 కిలోమీటర్ల వ్యత్యాసం ఉంది.
Also Read : ఈ కారులో వెళ్తే విమానంలో వెళ్ళినట్లే..
విండ్‌సర్ ఈవీ స్టాండర్డ్ వెర్షన్ ధర రూ.13.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఎక్సైట్ వేరియంట్‌గా వస్తుంది. అయితే దీని ప్రీమియం వెర్షన్ ఎక్స్‌క్లూసివ్ వేరియంట్ ధర రూ.14.99 లక్షలు, టాప్ వెర్షన్ ఎసెన్స్ వేరియంట్ ధర రూ.15.99 లక్షలు. అయితే ఎంజీ విండ్‌సర్ ప్రో కేవలం టాప్ ట్రిమ్, అంటే ఎసెన్స్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.17.50 లక్షలు. అంటే రూ.1.5 లక్షలు అదనంగా చెల్లించి మీ కారులో 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ బెనిఫిట్ పొందవచ్చు.
ఈ ఎలక్ట్రిక్ కారును బ్యాటరీ అద్దె (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్) సిస్టమ్‌తో తీసుకోవాలనుకుంటే.. మీరు విండ్‌సర్ ఈవీ కోసం ప్రారంభ ధర రూ.9.99 లక్షలు చెల్లించాలి. అయితే ఎక్స్‌క్లూసివ్ వేరియంట్‌కు రూ.10.99 లక్షలు, ఎసెన్స్ వేరియంట్‌కు రూ.11.99 లక్షలు. ఇందులో బ్యాటరీ అద్దె కిలోమీటరుకు రూ.3.5 ఉంటుంది. దీనికి విరుద్ధంగా, విండ్‌సర్ ప్రోను బ్యాటరీ అద్దెతో తీసుకోవడానికి రూ.12.50 లక్షలు చెల్లించాలి. ఇది ఎసెన్స్ వేరియంట్ కంటే కేవలం రూ.50,000 మాత్రమే ఎక్కువ. అయితే ఇందులో బ్యాటరీ అద్దె కిలోమీటరుకు రూ.4.5 ఉంటుంది. విండ్‌సర్ ప్రో, విండ్‌సర్ ఈవీలో రేంజ్‌లో తేడా ఉంది..ఫీచర్ల పరంగా చూస్తే, విండ్‌సర్ ప్రోలో ఏడీఏఎస్ టెక్నాలజీ లభిస్తుంది. అయితే విండ్‌సర్ ఈవీలో అలాంటి ఫీచర్లు ఏమీ లేవు.
Also Read : ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో మరో సెన్సేషన్.. క్రెటా, పంచ్‌లకు చుక్కలే