Yamaha Aerox : ఇండియాలో టూ వీలర్ మార్కెట్లో స్కూటర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పటికే మార్కెట్లో హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, టీవీఎస్ ఎన్‌టార్క్, సుజుకి యాక్సెస్ వంటి స్కూటర్లు ఆధిపత్యం చెలాయిస్తునున్నాయి. ఇప్పుడు తాజాగా 155సీసీ ఇంజన్‌తో వచ్చే ఈ పవర్ ఫుల్ స్కూటర్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఇది చాలా స్కూటర్లకు గట్టి పోటీనిస్తుంది. అంతేకాదు, ఈ స్కూటర్ అప్‌డేటెడ్ వెర్షన్ కూడా ఇటీవల విడుదలైంది. ఈ స్కూటర్ పేరు యమహా ఏరోక్స్ 155 ఎస్(Yamaha Aerox 155 S). దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం…
Also Read : ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ క్రాష్.. గంగోత్రి యాత్రలో విషాదం!
యమహా మోటార్ ఇండియా ఏరోక్స్ 155 ఎస్ 2025 అప్‌డేటెడ్ మోడల్‌ను విడుదల చేసింది. ఇది సాధారణ స్కూటర్ల కంటే భిన్నంగా ఒక పెర్ఫార్మెన్స్ స్కూటర్. అందుకే దీని లుక్ చాలా స్పోర్టీగా ఉంటుంది. కొత్త అప్‌డేట్ తర్వాత ఈ స్కూటర్‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.
యమహా కొత్త 2025 ఏరోక్స్ 155 ఎస్ స్కూటర్‌ను కంపెనీ మొదట కొత్త ఎమిషన్ నిబంధనలకు అనుగుణంగా OBD-2B కంప్లైంట్‌గా తయారు చేసింది. దీని 155cc ఇంజన్ 15 PS పవర్‌ను, 13.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో కంపెనీ సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తోంది. ఈ స్కూటర్‌లో వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ సిస్టమ్ ఇచ్చింది. దీని కారణంగా ఈ స్కూటర్ తక్కువ ఎండ్‌లో మంచి టార్క్‌ను, హై-ఎండ్‌లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది.
యమహా ఏరోక్స్ 155 ఎస్ స్కూటర్‌లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, మోటార్‌సైకిల్ తరహా ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్‌లు వస్తాయి. ఈ ఫీచర్లు మార్కెట్‌లో ఉన్న చాలా స్కూటర్లలో కనిపించవు. ఈ స్కూటర్ ఇప్పుడు 2 కొత్త కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది: ఐస్ ఫ్లూరో వెర్మిలియన్, రేసింగ్ బ్లూ. యమహా ఈ స్కూటర్ గ్రాఫిక్స్, డిజైన్‌కు రేసింగ్ టచ్ ఇచ్చింది. ఈ స్కూటర్‌ను కొత్త కలర్ ఆప్షన్‌లో కొనాలనుకుంటే దానిని రూ.1.53 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర) పెట్టి సొంతం చేసుకోవచ్చు. అయితే దీని మెటాలిక్ బ్లాక్ కలర్ రూ.1.50 లక్షలకు లభిస్తుంది.
హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ వంటి స్కూటర్ల కంటే ఇది కొంచెం ఎక్కువ ధర కలిగి ఉన్నప్పటికీ, వాటి 125సీసీ ఇంజన్ వేరియంట్‌ల ధర రూ.1.20 లక్షల వరకు ఉంటుందని గుర్తుంచుకోవాలి. యమహా ఏరోక్స్ 155 ఎస్‌లో 24.5 లీటర్ల బూట్‌స్పేస్ లభిస్తుంది. అంతేకాకుండా ఇది Y-Connect యాప్‌తో ఇంటిగ్రేట్ అయ్యి అనేక కనెక్టెడ్ ఫీచర్లను కూడా అందిస్తుంది.