New Car: కొత్త కారు ఫైనాన్స్ ద్వారా కొనాలనుకుంటున్నారా? రూ.10 లక్షల లోన్ తీసుకుంటే ఎంత ఈఎంఐ చెల్లించాలో తెలుసా?

భారతీయ మార్కెట్లో కార్ల కొనుగోలుపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంకు వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు ప్రముఖంగా ఉన్నాయి.

Written By: Chai Muchhata, Updated On : July 30, 2024 9:54 am

New Car

Follow us on

New Car: కారు కొనాలని ప్రతి ఒక్కరి కల. కానీ ఈ కలను కొందరు మాత్రమే నెరవేర్చుకుంటారు. ఒకప్పుడు ధనవంతుల ఇళ్లల్లో మాత్రమే కార్లు కనిపించేవి. కానీ ఇప్పుడు చిరుద్యోగులు సైతం తమ అవసరాలకు అనుగుణంగా కార్లను కొనుగోలు చేస్తున్నారు. కంపెనీలు సైతం మిడిల్ క్లాస్ పీపుల్స్ ను బేస్ చేసుకొని లో బడ్జెట్ కే కారును అందిస్తున్నాయి. అయితే ఎంత లో బడ్జెట్ ఉన్నా.. కారు కొనాలని అనుకున్నప్పుడు సరిపోయేంత డబ్బు ఉండదు. దీంతో ఫైనాన్స్ ద్వారా కారు కొనుగోలు చేసేందుకు చాలా కంపెనీలు అవకాశం ఇస్తున్నాయి. ఫైనాన్స్ ద్వారా కారు కొనుగోలు చేయడం ద్వారా తక్కువ వడ్డీకే రుణ సాయం అందుతుంది. పైగా ఫ్లెక్సిబులిటీ ఈఎంఐ ఉంటుంది. దీంతో కొందరు డబ్బున్న వారు సైతం ఈఎంఐ ద్వారా కారును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కారు కొనాలనుకునే సమయంలో ఫైనాన్స్ తీసుకుంటే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మార్కెట్లో కార్ల కొనుగోలుపై తక్కువ వడ్డీతో రుణ సాయం చేస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ కంపెనీలు మాత్రం అదనపు ఛార్జీలు మోపుతున్నాయి. అందువల్ల ఫైనాన్ష్ ద్వారా కారు తీసుకునేటప్పుడు ఏ బ్యాంకు ఎంత వడ్డీకి రుణం ఇస్తుందో తెలుసుకోవాలి. అయితే ప్రస్తుతం ఇండియన్ ఆటో మోబైల్ మార్కెట్లో కార్లు కొనేవారికి కొన్ని బ్యాంకులు మంచి సపోర్టుగా ఉంటున్నాయి. మిగతా వస్తువుల కంటే కార్ల పై ఫైనాన్స్ ను తక్కువ వడ్డీకే అందిస్తున్నాయి. వీటిలో ప్రభుత్వ బ్యాంకులైతే మరీ తక్కువగా ఉంటుంది. మరి ప్రస్తుతం కారు కొనుగోలు చేయాలంటే ఏ బ్యాంకు ఎంత వడ్డీకి ఇస్తుందో తెలుసుకుందాం..

భారతీయ మార్కెట్లో కార్ల కొనుగోలుపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంకు వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు ప్రముఖంగా ఉన్నాయి. వీటిల్లో మిగతా బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే రుణం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బ్యాంకుల్లో రూ.10 లక్షల వరకు లోన్ తీసుకుంటే ఏంత ఈఎంఐ ఉంటుంది? ఎంత శాతం వడ్డీ విధిస్తారు? అనే వివరాల్లోకి వెళ్దాం..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి కారు రుణం తీసుకోవచ్చు. ఈ బ్యాంకు నుంచి రూ. 10 లక్షల లోన్ తీసుకుంటే 8.85 శాతం వడ్డీ రేటు విధిస్తారు. దీంతో నెలనెలా రూ.20,686 ల ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 5 ఏళ్ల పాటు చెల్లిస్తే రుణం మొత్తం తీరుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో పాటు సౌత్ ఇండియన్ బ్యాంకులో ఈ మొత్తానికి రుణం తీసుకుంటే 8.75 శాతం వడ్డీ ఉంది. దీంతో 5 ఏళ్ల పాటు నెల నెలా రూ.20,637 చెల్లిస్తే రుణం మొత్తం క్లియర్ అవుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మరొకటి బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ బ్యాంకు నుంచి రూ. 10 లక్షల లోన్ తీసుకుంటే 8.90 శాతం వడ్డీ విధిస్తారు. నెలనెలా రూ.20,710 చొప్పున ఐదేళ్ల పాటు చెల్లించాలి.

ఒక ప్రైవేట్ బ్యాంకుల విషయానికొస్తే ఐసీఐసీఐ బ్యాంకులో రూ. 10 లక్షల లోన్ తీసుకుంటే 9.10 శాతం వడ్డీ రేటు ఉంటుంది. దీంతో నెలనెలా రూ.20,807 ఈఎంఐని 5 ఏళ్ల పాటు చెల్లించాలి. యాక్సిస్ బ్యాంకులో అయితే 9.30 శాతం వడ్డీ రేటు ఉంది. దీంతో రూ. 20,904 ఈఎంఐ చెల్లించాలి. క్రెడిట్ స్కోరు. ఖాతాదారుడి ట్రాన్జాక్షన్ బట్టి వడ్డీ రేటులో మార్పులు ఉండే అవకాశం ఉంది.

Tags