https://oktelugu.com/

Aarthi Agarwal: తరుణ్ కాదు అతడి వల్లే ఆర్తి అగర్వాల్ కెరీర్ నాశనమైంది, డిప్రెషన్ కి గురైంది… సంచలనం రేపుతున్న అల్లరి రాముడు ప్రొడ్యూసర్ కామెంట్స్!

హీరోయిన్ ఆర్తి అగర్వాల్ జీవితం ముగిసిన తీరు అత్యంత బాధాకరం. స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఆర్తి అగర్వాల్ కెరీర్ అనుకోని వివాదాలతో డ్యామేజ్ అయ్యింది. ఆర్తి అగర్వాల్ కెరీర్ నాశనం కావడానికి ఓ వ్యక్తి కారణం అనే వాదన ఉంది. ఆర్తి అగర్వాల్ తో అల్లరి రాముడు మూవీ చేసిన ప్రొడ్యూసర్ చంటి అడ్డాల ఈ మేరకు కీలక కామెంట్స్ చేశాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : July 30, 2024 / 08:56 AM IST

    Aarthi Agarwal

    Follow us on

    Aarthi Agarwal: హీరోయిన్ ఆర్తి అగర్వాల్ తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసింది. వెంకటేష్ హీరోగా నటించిన ‘ నువ్వు నాకు నచ్చావ్ ‘ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత అవకాశాలు వెల్లువెత్తాయి. వరుస సినిమాలు చేసింది. అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తరుణ్, ప్రభాస్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి,మహేష్ బాబు, రవితేజ, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది.

    Also Read: కల్కి సినిమా కి ఇంత క్రేజ్ ఏంటి భయ్య…నెల గడిచిన కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందిగా…

    2007లో ఆర్తి అగర్వాల్ ఉజ్వల్ నికమ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. వివాహం అనంతరం సినిమాలకు దూరమైంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పెళ్ళైన రెండేళ్లకే విడాకులు తీసుకుని భర్తతో విడిపోయింది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించింది కానీ అవి సక్సెస్ కాలేదు. సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. మూవీ ఆఫర్స్ కోసం బరువు తగ్గాలని నిర్ణయించుకున్న ఆర్తి సర్జరీ చేయించుకుంది. కానీ ఆ సర్జరీ ఫెయిల్ అవడంతో 2015లో గుండెపోటుతో మరణించింది.

    అయితే ఆర్తి అగర్వాల్ కెరీర్ మంచి ఫార్మ్ లో ఉన్న టైంలో ప్రేమ, బ్రేకప్ వంటి రూమర్స్ చాలా వచ్చాయి. అదే సమయంలో ఆర్తి అగర్వాల్ క్లీనింగ్ కెమికల్ తాగి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆమె హీరో తరుణ్ ని ఘాడంగా ప్రేమించిందని .. ఆ ప్రేమ విఫలం కావడంతో డిప్రెషన్ కి గురైందని. అందుకే చనిపోవాలని ఆత్మహత్యకు ప్రయత్నించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆర్తి అగర్వాల్ మరణం పై ఓ తెలుగు ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

    ప్రొడ్యూసర్ చంటి అడ్డాల తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. అల్లరి రాముడు సినిమాకి ముందుగా ఛార్మిని హీరోయిన్ గా తీసుకున్నాం. ఎన్టీఆర్, ఛార్మి లావుగా ఉంటే కష్టం అని ఆలోచించి తర్వాత ఆర్తి అగర్వాల్ ని తీసుకున్నాం. అలా తను మా బ్యానర్లోకి వచ్చింది. ఆ తర్వాత అడవి రాముడు సినిమాలో ప్రభాస్ కోసం ఆమెను తీసుకున్నాం. ఆర్తి అగర్వాల్ డిప్రెషన్ లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఆమె తండ్రి.

    ఆర్తి సెట్స్ లో చాలా సరదాగా ఉండేది. కానీ ఆమె తండ్రి వస్తే మాత్రం సైలెంట్ అయిపోయేది. ఆయన ప్రభావం ఆమెపై బాగా ఉంది. సినిమాలే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా ఆయనకు ఇష్టం వచ్చినట్లే ఉండేలా ఒత్తిడి చేసేవారు. అందుకే ఆర్తి డిప్రెషన్ లోకి వెళ్ళింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

    ఆర్తి అగర్వాల్ చెల్లి అదితి అగర్వాల్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ డబ్యూ మూవీ గంగోత్రి లో అదితి అగర్వాల్ నటించింది. అక్క ఆర్తి అగర్వాల్ స్థాయిలో ఆమె సక్సెస్ కాలేదు. అదితి అగర్వాల్ సైతం పరిశ్రమకు దూరమైంది.

    Also Read: రాజాసాబ్ గ్లింప్స్ లో ప్రభాస్ లుక్ బాగుంది…కానీ మారుతి ఆ ఒక్క మిస్టేక్ చేయకుండా ఉంటే బాగుండేది…