spot_img
Homeబిజినెస్Vivo X300s features: Vivo నుంచి స్పెషల్ మొబైల్.. బ్యాటరీ లైఫ్ మాములుగా ఉండదుగా..

Vivo X300s features: Vivo నుంచి స్పెషల్ మొబైల్.. బ్యాటరీ లైఫ్ మాములుగా ఉండదుగా..

Vivo X300s features: చైనా కంపెనీకి చెందిన Vivo కొత్త మొబైల్ ను తీసుకురాబోతుంది. ఇప్పటికే వివో ఫోన్లపై వినియోగదారులకు మంచి అభిప్రాయం ఉంది. ఈ మొబైల్స్ లో కెమెరా పనితీరుతో పాటు బ్యాటరీ వ్యవస్థ మెరుగ్గా ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అందుకు అనుగుణంగా చాలా మొబైల్స్ వినియోగదారులను ఇంప్రెస్ చేశాయి. అయితే ఈ కంపెనీ నుంచి లేటేస్ట్ గా X300s అనే మొబైల్ ను ఈ నెల 30వ తేదీన మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే దీని ఫ్రీ ఆర్డర్ బుకింగ్ స్టార్ట్ చేశారు. అయితే ఈ మొబైల్ గురించి ఆన్ లైన్ లో ఆసక్తిగా చర్చ సాగుతోంది. ఇందులో ఉండే ఫీచర్స్ గురించి తెలిసిన వెంటనే కొనుగోలు చేయాలన్న ఆశ పుడుతుంది.. అని అంటున్నారు.

త్వరలో మార్కెట్లోకి రాబోయే Vivo X300sమొబైల్ లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయని అంటున్నారు. ఇంుదలో 6.78 అంగుళాల డిస్ ప్లే కనిపిస్తుంది. ఇది 1.5 కే రిజల్యూషన్ తో కనిపిస్తుంది. దీంతో మూవీస్ చూసేవారికి ఇది అనుగుణంగా ఉంటుంది. అలాగే ఈ డిస్ ప్లే 144 Hzరిఫ్రెష్ రేట్ తో పనిచేయడం వల్ల స్క్రోలింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఈ మొబైల్ డిజైన్ కూడా ఆకట్టుకునేవిధంగా ఉంది.

ఇందులో 12 జీబీ ర్యామ్ తో పాటు 256 జీబీ స్టోరేజ్ నుంచి 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ వరకు అవకాశం ఉంటుంది. దీంతో మల్టీ టాస్కింగ్ కోసం యూజ్ చేసేవారికి ఫుల్ సపోర్టుగా ఉంటుంది. ఒకేసారి పలు రకాల యాప్స్ ఉపయోగించినా.. మొబైల్ వేగం తగ్గకుండా ఉంటుంది. వీటితో పాటు అదనపు ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. మీడియా టెక్ డైమెన్సిటీ 9500 చిప్ సెట్ ఉండడంతో పవర్ ఫుల్ వర్క్ చేస్తుంది.

వీవో మొబైల్స్ అనగానే కెమెరా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. ఈ కొత్త మొబైల్ లో 200 ఎంపీ మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే 50 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్ పనిచేయనుంది. 50 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం పనిచేస్తుంది. దీంతో సోషల్ మీడియా కంటెంట్లు సృష్టించేవారితో పాటు ప్రొఫెషన్ ఫొటోగ్రఫీ వారికి ఈ కెమెరా తీరు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇందులో 7,100 mAh బ్యాటరీని చేర్చారు. ఇది 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో సపోర్ట్ చేయడం వల్ల బిజీగా ఉండేవారికి అనుగుణంగా ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular