Honda 0 Alpha electric SUV: ప్రముఖ కార్ల కంపెనీ Honda నుంచి ఇప్పటివరకు ఎన్నో రకాల ప్రీమియం కార్లు మార్కెట్లోకి వచ్చాయి. లగ్జరీ కార్లలో తిరగాలని కోరుకునేవారు హోండా కార్లు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అందులోనూ ఈ కార్లు ఎక్కువగా SUV వేరియంట్ లో ఉండడంతో చాలామంది వీటిని కొనుగోలు చేస్తారు. అయితే ఈ కంపెనీ 2026-27 ఆర్థిక సంవత్సరంలో లగ్జరీ లుక్ లో ఉండే కారులు తీసుకురాబోతుంది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ ఆధారిత కారు. ఇందులో బలమైన బ్యాటరీ ఉండడంతో మైలేజ్ కూడా ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా 0 ఆల్ఫా కాన్సెప్ట్ కలిగి ఉండడంతో వినియోగదారులు ఎక్కువగా ఆదరిస్తారని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇంతకీ ఈ కారులో ఇంకా ఏమేమి ఉన్నాయంటే?
కాలం మారుతున్న కొద్దీ కార్ల వినియోగదారుల అభిరుచులు మారిపోతూ ఉంటాయి. ఇందుకు అనుగుణంగా కార్లను కూడా లేటెస్ట్ డిజైన్, టెక్నాలజీతో తయారుచేస్తున్నారు. రాబోయే రోజుల్లో హోండా కంపెనీ నుంచి 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ SUV కారు రాబోతుంది. ఇందులో 0 సిరీస్ డిజైన్ లాంగ్వేజ్, ప్లస్ ఫిటింగ్ డోర్ హ్యాండిల్స్, ప్రత్యేకమైన స్టీరింగ్ వీల్ కలిగి ఉంది. ఎక్స్టీరియర్ డిజైన్ మొత్తం బాక్సి మోడల్ లో కనిపిస్తుంది. ఇది నిటారుగా ఉండడం చూసి మిడ్ సైజ్ SUV అని అంటారు. ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే ఇందులో పూర్తిగా డిజిటల్ డాష్ బోర్డు అమర్చారు. వెంటిలేటెడ్ సీట్లతో పాటు బ్యాక్ సైడ్ సన్ సైడ్ తో ఉండే సీట్లు కనిపిస్తాయి. ఇందులో ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ ను అమర్చారు. శ్రీ జనరేటివ్ బ్రేకింగ్ కోసం పాడల్ పిస్టర్లు, విశాలమైన క్యాబిన్ ఉండనుంది.
ఈ కారులో 65 నుంచి 75 కిలోవాట్ వరకు బ్యాటరీని చేర్చే అవకాశం ఉంది. దీనిని ఒకసారి చార్జింగ్ చేస్తే 450 నుంచి 500 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ కారు మార్కెట్లోకి వస్తే రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే దీనిని పరీక్షించి ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. కొందరు నిపుణులు చెబుతున్న ప్రకారం ఈ కారు మార్కెట్లోకి వస్తే ఇప్పటికే ఉన్న హుందాయి క్రెటా ఈవీ, మారుతి ఈ విటారా, టాటా హారియర్ ఈవీ కార్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. లగ్జరీ కార్లలో తిరగాలని అనుకునేవారు ఈ కారులో ఉండే ప్రీమియం ఫీచర్లతో ఎంజాయ్ చేయవచ్చని అంటున్నారు.
