Ventilated seat car : మనదేశంలో వెంటిలేటెడ్ సీట్లు కార్లలో ఒక ముఖ్యమైన ఫీచర్‌గా మారాయి. ఇప్పుడు కారు కొనేటప్పుడు చాలా మంది ఇలాంటి లగ్జరీ ఫీచర్లను పరిగణనలోకి తీసుకుంటున్నారు. కొన్నేళ్ల వరకు ఈ ఫీచర్ కేవలం ఖరీదైన కార్లలో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు రూ. 15 లక్షల లోపు ధర కలిగిన కొన్ని కార్లలో కూడా అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే లాంగ్ జర్నీ చేస్తున్నప్పటికీ చెమట రాదు. అలసిపోరు.వెంటిలేటెడ్ సీట్లు కలిగిన 5 బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు ఏమిటో చూద్దాం.
Also Read : క్రాష్ టెస్ట్‌లో దుమ్మురేపిన భారతీయ ఎస్‌యూవీ
టాటా పంచ్
టాటా పంచ్ ఈవీ వెంటిలేటెడ్ సీట్లు కలిగిన అత్యంత సరసమైన ఎస్‌యూవీ. అంతేకాకుండా, ఈ సౌకర్యాన్ని అందించే భారతదేశపు చౌకైన ఎలక్ట్రిక్ కారు కూడా ఇదే. ఇది రూ.12.84 లక్షల నుండి రూ.14.44 లక్షల ధర పరిధిలో అందుబాటులో ఉంది. ఇది రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. 25kWh బ్యాటరీతో 265km పరిధిని, 35kWh బ్యాటరీతో 365km వరకు పరిధిని అందిస్తుంది. ఈ కారులోని Empowered + ట్రిమ్‌లో వెంటిలేటెడ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
టాటా నెక్సాన్
టాటా నెక్సాన్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు కేవలం దాని టాప్-స్పెక్ ఫియర్‌లెస్ + PS మోడల్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ. 13.30 లక్షల నుండి రూ. 15.60 లక్షల మధ్య ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్, CNG వేరియంట్‌లలో కూడా లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో 120hp ఇంజన్ ఉండగా, డీజిల్‌లో 115hp ఇంజన్ ఎంపిక ఉంది. CNG వేరియంట్‌లో 100hp ఇంజన్ ఉంటుంది.
కియా సిరోస్
కియా సిరోస్‌లో ముందు మరియు వెనుక రెండు సీట్లలోనూ వెంటిలేషన్ సీట్లు ఉన్నాయి. వెనుకవైపు కూడా హాఫ్ కూలింగ్ సీటు లభిస్తుంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు HTX, HTX+ ట్రిమ్‌లలో రూ. 13.30 లక్షల నుండి ప్రారంభమవుతాయి. అయితే, వెనుక సీట్ల వెంటిలేషన్ HTX+ (O) వేరియంట్‌కు మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. దీని ధర రూ. 17.80 లక్షలు.
కియా సోనెట్
కియా సోనెట్ టాప్-స్పెక్ GTX+, X-Line మోడళ్లలో కూల్డ్ ఫ్రంట్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ. 14.80 లక్షల నుండి ప్రారంభమై ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో కూడిన డీజిల్ మోడల్‌కు రూ. 15.60 లక్షల వరకు ఉంటుంది.
హ్యుందాయ్ వెర్నా
హ్యుందాయ్ వెర్నా సెడాన్ SX(O) ట్రిమ్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీటింగ్ లభిస్తుంది. దీని ధర ఇంజన్ ఎంపికను బట్టి రూ. 14.83 లక్షల నుండి రూ. 17.55 లక్షల వరకు ఉంటుంది. ఇందులో సాధారణ పెట్రోల్ ఇంజన్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆఫ్షన్లు అందుబాటులో ఉన్నాయి.
Also Read : 5-స్టార్ సేఫ్టీతో మారుతి డిజైర్ హైబ్రిడ్.. ధర ఎంతో తెలుసా ?