Honda : ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్ ‘మేడ్ ఇన్ ఇండియా’ సత్ఫలితాలనిస్తోంది. ఇందులో భాగంగా భారతీయ కార్ల సత్తా ఇప్పుడు ప్రపంచాన్ని మెప్పిస్తోంది. తాజాగా ఒక భారతీయ ఎస్‌యూవీ జపాన్ క్రాష్ టెస్ట్‌లో అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. టాటా హారియర్‌కు కూడా గట్టి పోటీనిచ్చే ఆ కారు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మనదేశంలో దాదాపు ఒకటిన్నర సంవత్సరం కిందట అంటే 2023 సెప్టెంబర్‌లో విడుదలైన ‘మేడ్ ఇన్ ఇండియా’ ఎస్‌యూవీ హోండా ఎలివేట్ సత్తాకు జపాన్ దేశం కూడా ఫిదా అయింది. జపాన్ NCAP క్రాష్ టెస్ట్‌లో హోండా ఎలివేట్ సేఫ్టీలో ఏకంగా 5స్టార్ రేటింగ్ సొంతం చేసుకంది. జపాన్ ఆటోమొబైల్ కంపెనీ అయిన హోండా ఈ ఎలివేట్ ఎస్‌యూవీని పూర్తిగా భారతదేశంలోనే తయారు చేసింది. అంతేకాదు, హోండా ఈ ఎలివేట్‌ను ఇండియా నుంచే జపాన్‌కు ఎగుమతి చేస్తోంది. జపాన్‌లో దీనిని WR-V పేరుతో విక్రయిస్తోంది.
Also Read : మారుతికి గట్టి పోటీ.. ఆ వెర్షన్ లో కూడా హోండా కారు వచ్చేస్తోంది
జపాన్ NCAP కార్ల సేఫ్టీని పరీక్షించడానికి హోండా ఎలివేట్‌ను వివిధ వేగాల్లో (గంటకు వరుసగా 10 కిమీ, 20 కిమీ, 45 కిమీ) క్రాష్ టెస్ట్ చేసింది. ఈ టెస్టింగులో ఈ ఎస్‌యూవీ ప్రతి వేగంలోనూ అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరిచింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. లేన్ డిపార్చర్ ప్రివెన్షన్ విషయంలో కూడా ఈ ఎస్‌యూవీ 100 శాతం విజయాన్ని సాధించింది. భారతదేశంలో హోండా ఎలివేట్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, టాటా హారియర్, ఎంజి ఆస్టర్ వంటి కార్లకు గట్టి పోటీనిస్తోంది.
ఈ ఎస్‌యూవీ భారతదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా అమ్ముడవుతోంది. హోండా ఎలివేట్‌ను ప్రపంచంలోని అనేక మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. దీని అమ్మకాలలో ఎక్కువ భాగం ఎగుమతుల ద్వారానే వస్తుంది. హోండా ఎలివేట్ అన్ని రకాల క్రాష్ టెస్ట్‌లలో 5 స్టార్స్ సాధించింది. అంతేకాదు, ఈ ఎస్‌యూవీ పాదచారుల సేఫ్టీ విషయంలో కూడా మంచి మార్కులు సాధించింది.
లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో నిండిన ఈ ఎస్‌యూవీ బేస్ మోడల్ ధర రూ. 11.73 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ ధర రూ. 16.93 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. హోండా ఎలివేట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి అనేక సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. అంతేకాకుండా, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్, ఒక లేన్‌వాచ్ కెమెరా కూడా ఇందులో ఉన్నాయి. డ్రైవర్ హెల్పింగ్ కోసం ఫ్రంట్ వైడ్-వ్యూ కెమెరాను ఉపయోగించే హోండా సెన్సింగ్ ADAS టెక్నాలజీని కూడా ఈ ఎస్‌యూవీ కలిగి ఉంది.
Also Raed : రూ.8లక్షల్లోపే ఫ్యామిలీకి బెస్ట్ కారు అంటే ఇదే !