Sony Xperia 1 VII: ప్రముఖ కంపెనీ SONY నుంచి మొబైల్ మార్కెట్లోకి వస్తుందంటే చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఇప్పటికే SONY వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ విభాగంలో సక్సెస్ సాధించింది. మొబైల్స్ లోనూ తనదైన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ కంపెనీ నుంచి Xperia 1 VII అనే లేటెస్ట్ వెర్షన్ ను రిలీజ్ చేసింది. ఇందులో ప్రత్యేకంగా కెమెరాతో పాటు బ్యాటరీ వ్యవస్థను కూడా మెరుగుపరిచింది. దీంతో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోరుకునే వారికి ఈ మొబైల్ ప్రత్యేకంగా పనిచేస్తుందని అంటున్నారు. అయితే దీని ధర కాస్త ఎక్కువగానే ఉన్నా కూడా హై రేంజ్ పీపుల్స్ కోసం ఇది కావాల్సిన సాఫ్ట్వేర్ను అందిస్తుంది. అలాగే ఇందులో ఉండే రామ్ తదితర ఫీచర్లు లగ్జరీ యూజర్స్ కు ఉపయోగకరంగా ఉంటాయి. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
SONY నుంచి మార్కెట్లోకి రాబోతున్న Xperia 1 VII డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉంది. దీని వెనుక భాగం texctured కలిగి ఉండడం వల్ల ఇది చేతిలో పట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో చేతి నుంచి జారిపోతుంది అన్న ఫీలింగ్ ఉండదు. అలాగే మొబైల్ ఫ్లాట్ సైడ్, డెడికేటెడ్ కెమెరా సెట్టర్ బటన్ ను కలిగి ఉంది. పూర్తిగా ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లేను కలిగి ఉండడంతో వీడియోలు చూడడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ మొబైల్లో ఉండే డిస్ప్లే హై క్వాలిటీ తో పని చేస్తుంది. ఇది HD+ OLED డిస్ప్లేను కలిగి కలిగి ఉండి..120 Hz LTPO రిప్రెష్ రేట్ తో పని చేస్తుంది. టచ్ షాంప్లింగ్ రేట్ 240 Hz గా ఉండనుంది. దీంతో గేమింగ్ ఆడే వారి కోసం ఇది చాలా స్మూత్ స్క్రోలింగ్ గా పనిచేస్తుంది.
ఈ మొబైల్లో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ప్రాసెసర్ ను అమర్చారు. ఇందులో 8 ఎలైట్ ప్రాసెసర్ తో పాటు 12 GB రామ్, 256 స్టోరేజ్ ఉండనుంది. ఒకవైపు వేగవంతంగా మొబైల్ పనిచేయడంతో పాటు మరోవైపు కావాల్సిన ఫోటోలు, వీడియోలను స్టోర్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 తో పనిచేయడంతో అదనపు టాప్స్ అవసరం లేకుండా ఆండ్రాయిడ్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఆరు సంవత్సరాల వరకు సెక్యూరిటీగా ఉండే అవకాశం ఉంది. సోనీ కంపెనీ ఈ కొత్త మొబైల్ లో 48 MP మెయిన్ కెమెరా ను అమర్చారు. అలాగే ఇందులో 48 MP అల్ట్రా వైడ్ సెన్సార్ కెమెరా కూడా ఉండనుంది. టెలిఫోటో కోసం 12 MP కెమెరా పనిచేయనుంది. ఈ మూడు కెమెరాలు అత్యధిక రిజర్వేషన్తో కావలసిన ఫోటోలను అందిస్తాయి. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోసం పనిచేసేవారు ఈ కెమెరాతో ఎన్నో రకాలుగా ప్రయోజనాలు పొందవచ్చు. ఈ మొబైల్లో 5000 mAh బ్యాటరీని చేర్చారు. ఇది ఒక్కసారి చార్జింగ్ చేస్తే 23 గంటల పాటు పనిచేస్తుంది. ఇది 30 W వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ తో పని చేస్తుంది. దీనిని రూ.1,40,990 ప్రారంభ ధరతో విక్రయించనున్నారు.