Retro Trailer : సౌత్ లో అన్ని భాషల్లోనూ మంచి మార్కెట్ ఉన్న హీరోలలో ఒకరు సూర్య(Suriya Sivakumar). కానీ చాలా ఏళ్ళ నుండి ఆయన వరుస ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ మార్కెట్ మొత్తాన్ని పోగొట్టుకుంటున్నాడు. గత ఏడాది ‘కంగువ’ చిత్రం తో భారీ కం బ్యాక్ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇక సూర్య పని అయిపోయింది అని అనుకుంటున్న సమయంలో ‘రెట్రో'(Retro Movie) టీజర్ వచ్చింది. కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే(Pooja Hegde) నటించింది. టీజర్ కాస్త సీరియస్ గా, ఆసక్తి కరంగా ఉండడంతో సూర్య అభిమానులు ఈ సినిమా పై ఆశలు పెట్టుకున్నారు. అంతే కాకుండా ఈ చిత్రం నుండి విడుదలైన ‘కన్నిమా’ పాట కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ ఇలా ఎక్కడ చూసిన ఈ పాటనే కనిపిస్తుంది.
Also Read : మరోసారి కాజల్ అగర్వాల్ తో రామ్ చరణ్ రొమాన్స్..కానీ ట్విస్ట్ ఏమిటంటే!
సినిమాకి కావాల్సినంత హైప్ క్రియేట్ అయ్యింది. నేడు థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసింది మూవీ టీం. ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత ఒకప్పుడు సూర్య సినిమాలు ఏ రేంజ్ లో ఉండేవో గుర్తు చేసింది. ఈ సినిమాలో గ్యాంగ్ వార్స్ ఫుల్ గా ఉన్నాయి, ఆ గ్యాంగ్ వార్స్ లో ఒక అందమైన లవ్ స్టోరీ. గొడవలకు దూరంగా ప్రేమించిన అమ్మాయి కోసం ఉందామంటే హీరో గతం అతన్ని విడిచిపెట్టదు. గతం తాలూకు పరిణామాలు వర్తమానం లో వస్తూనే ఉంటాయి. ట్రైలర్ ని చూస్తుంటే హీరోయిన్ పూజ హెగ్డే కి కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న క్యారక్టర్ పడినట్టుగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు కేవలం గ్లామర్ షోస్ కి మాత్రమే పరిమితమైన పూజ హెగ్డే, ఎట్టకేలకు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఈ సినిమా నుండి పోషించబోతుంది అనే సంకేతం తన అభిమానులకు ఇచ్చింది.
ట్రైలర్ చూస్తున్నంత సేపు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ ఎక్కడా మిస్ అవ్వలేదు. అదే విధంగా సంతోష్ నారాయణ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా కొత్తగా అనిపించింది. నటీనటులు పెర్ఫార్మన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలంటే మొదటి నుండి మన యూత్ ఆడియన్స్ ఎంతో ఆసక్తి. ఆయన టేకింగ్ స్టైల్ వేరు, ఎక్కడా కూడా బోర్ కొట్టదు. కాబట్టి ఈ చిత్రం కచ్చితంగా సూర్య కం బ్యాక్ మూవీ గా నిలుస్తుందని అంటున్నారు అభిమానులు. మే1 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. తమిళం, తెలుగు తో పాటు హిందీ లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగవంశీ కొనుగోలు చేసాడు. వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న నాగవంశీ ఖాతాలో ఈ చిత్రం మరో హిట్ గా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.