Viral Video : వ్యాపారం మొదలెట్టిన 11 నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవ్వడం అంత తేలికైన విషయం కాదు. ఎలాంటి అండాదండా లేకుండా ముగ్గురు అమ్మాయిలు సాధించిన విజయం కేవలం ఒకే ఒక్క చిన్న తప్పు కారణంగా రాత్రికి రాత్రి పేకమేడలాగా కూలిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. గత పది రోజుల నుండి ఎక్కడ చూసినా ‘అలేఖ్య చిట్టి పికిల్స్'(Alekhya Chitti Pickles) పేరు మారుమోగిపోతూ ఉంది. ఇంత ధరలు ఉన్నాయి ఏంటండీ? అని ఎంతో మర్యాదగా ఒక కస్టమర్ అడిగితే, అతన్ని అనరాని మాటలు అంటూ అలేఖ్య పెట్టిన ఒక ఆడియో మెసేజ్ సృష్టించిన కలకలం ఇది. ఈ ఘటన జరిగిన తర్వాత ముగ్గురు అక్కాచెల్లెల్లు క్షమాపణలు చెప్పారు. కానీ కస్టమర్స్ శాంతించలేదు, ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు, తిడుతూనే ఉన్నారు. అవి భరించలేక అలేఖ్య హాస్పిటల్ పాలైంది. ఇప్పుడు సురక్షితంగానే బయటకి వచ్చింది.
Also Read : మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టిన అలేఖ్య చిట్టి..వైరల్ అవుతున్న వీడియో!
రెండు మూడు రోజుల క్రితమే ఒక వీడియో ద్వారా ఇక నుండి ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాము, మేము కూడా బ్రతకాలి కదండీ, ఇక నుండి నా పనులు నేను చేసుకుంటాను, ఎప్పటి లాగా వీడియోస్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది సుమీ. నేడు కాసేపటి క్రితమే రమ్య ఒక వీడియో విడుదల చేసి , తమ భవిష్యత్తు కార్యాచరణపై నెటిజెన్స్ కి ఒక క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ ని కేవలం 11 నెలల్లోనే మూసేస్తామని అనుకోలేదు. అవును, ఇకమీదట అలేఖ్య చిట్టి పికిల్స్ ఉండదు. కానీ మేము త్వరలోనే రమ్య మోక్ష పికిల్స్ పేరుతో కొత్త వ్యాపారం మొదలు పెట్టబోతున్నాము. ఈ వ్యాపారం లో మా అక్క అలేఖ్య ఉండదు. కేవలం నేను నా చెల్లి మాత్రమే ఇందులో ఉంటాము. ఒకప్పటి లాగా భారీ రేట్స్ తో కాకుండా, ప్రతీ సామాన్యుడు కొనుగోలు చేసే విధమైన రేట్స్ తోనే మీ ముందుకొస్తాం’.
‘కాకపోతే కాస్త సమయం పడుతుంది, కనీసం రెండు నెలలు పట్టొచ్చు. ఇంత పెద్ద గొడవ జరిగిన తర్వాత మళ్ళీ పూర్వ వైభవం మా బిజినెస్ కి దక్కుతుందో లేదో మాకు తెలియదు. కానీ మాకు ఇన్ స్టాగ్రామ్ మరియు ఇతర సోషల్ మీడియా మాధ్యమాలలో మమ్మల్ని ఇష్టపడేవాళ్లు తరచూ మెసేజ్ చేస్తున్నారు. మళ్ళీ కం బ్యాక్ ఇవ్వండి అని అడుగుతున్నారు. కాబట్టి మేము మళ్ళీ సక్సెస్ అవ్వగలం అని అనుకుంటున్నాను. చాలా మంది మేము లైసెన్స్ లేకుండా నడుపుతున్నామని అంటున్నారు. మా దగ్గర అన్ని రకాల లైసెన్స్ ఉంది. మా పికిల్స్ వెనుక FSSAI ముద్ర ఉంటుంది, లైసెన్స్ నెంబర్ కూడా అందులో ఉంటుంది. మేము ప్రారంభించబోయే కొత్త బిజినెస్ కూడా అన్ని రకాల అనుమతిని తీసుకొనే ప్రారంభిస్తాము. అందుకే కాస్త సమయం పడుతుంది. అయితే ఈసారి కస్టమర్స్ తో మాట్లాడేందుకు ప్రత్యేకంగా ఒకరిని పెట్టుకోవాలని అనుకుంటున్నాము’ అంటూ చెప్పుకొచ్చింది రమ్య.